పార్టీలో నాగార్జున, ఎన్టీఆర్‌, అఖిల్‌తో కలిసి ప్రభాస్‌ కిర్రాక్‌ డాన్స్.. అడ్డంగా దొరికిపోయిన ఆ రహస్య జంట..

Published : Jun 25, 2024, 01:34 PM IST

ప్రభాస్‌, ఎన్టీఆర్‌, నాగార్జున కలిసి డాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ ముగ్గురు పార్టీలో ఎంజాయ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా? ఆ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. వైరల్‌ అవుతుంది.   

PREV
17
పార్టీలో నాగార్జున, ఎన్టీఆర్‌, అఖిల్‌తో కలిసి ప్రభాస్‌ కిర్రాక్‌ డాన్స్.. అడ్డంగా దొరికిపోయిన ఆ రహస్య జంట..

ప్రభాస్‌ని పార్టీల్లో చూడటం చాలా తక్కువ. ఆయన సినిమా షూటింగ్‌ల్లో, లేదంటే ఎయిర్‌ పోర్ట్ లోనే కనిపిస్తారు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌. ఎన్టీఆర్‌ కూడా చాలా అరుదు. మహేష్‌, చరణ్‌లతో రేర్‌గా కనిపిస్తాడు. మరోవైపు నాగార్జున కూడా అంతే. కానీ వీరంతా ఒకేచోట కలిశారు. ఓ రోజు రాత్రి దుమ్ము దుమ్ముగా పార్టీ చేసుకున్నారు. పండగ చేసుకున్నారు. అదిరిపోయే మాస్‌ సాంగ్‌లకు డాన్సులు వేశారు.
 

27

ఎన్టీఆర్‌, ప్రభాస్, నాగార్జున, అఖిల్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఒకేచోట చేసి పార్టీ చేయడం విశేషం. లేటెస్ట్ గా ఈ రేర్‌ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఇందులో ప్రభాస్‌ డాన్స్ లు అదిరిపోయేలా ఉన్నాయి. సాధారణంగా ప్రభాస్‌ కాస్త సైలెంట్‌గా ఉంటాడని, షై ఫీలింగ్‌తో ఉంటాడని అంటారు. కానీ ఇందులో మాత్రం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 

37

ఈ పార్టీలో నాగార్జున `శివ` సినిమాలోని పాట వస్తుంది. దీనికి డాన్స్ వేయాలని నాగార్జునకి ప్రభాస్‌ చెప్పడం విశేషం. పక్కన ఉన్న ఎన్టీఆర్‌ని సైతం దగ్గరకు తీసుకున్నారు. ముగ్గురు కలిసి డాన్స్ చేశారు. మాస్‌ స్టెప్పులతో అదరగొట్టారు. వీరి పక్కనే అఖిల్‌ కూడా ఉండటం విశేషం. 
 

47

రాత్రి సమయంలో జరిగిన ఈ పార్టీలో చాలా మంది సెలబ్రిటీలున్నారు. నిర్మాత శోభూ యార్లగడ్డ ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ స్పష్టంగా కనిపించడం లేదు. బ్యాక్‌ సైడ్‌లో ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు కూడా ఈ పార్టీలో ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం. ఇక ప్రభాస్‌, తారక్‌, నాగ్‌లను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వారిపైనే అందరి ఫోకస్‌ ఉంది. 
 

57

ఇందులో ఓ రహస్య జంట దొరికిపోయింది. ఆ జంట ఎవరో కాదు సుప్రియ, అడివి శేష్‌. ఈ ఇద్దరు డేట్‌లో ఉన్నారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే పుకార్లు వచ్చాయి. ఆ మధ్య పెళ్లి రూమర్లు కూడా వచ్చాయి. కానీ ఈ పార్టీలో మాత్రం ఈ ఇద్దరు కలిసి కనిపించారు. సాంగ్‌కి డాన్స్ మూమెంట్‌ ఇస్తూ కనిపించారు. 
 

67

ఈ వీడియో `ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌ టైమ్‌లోది అని అర్థమవుతుంది. ఇందులో తారక్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌ టైమ్‌లో ఓ సందర్భంలో పంచుకున్న స్టిల్‌ లుక్‌లోనే , అదే డ్రెస్‌లోనే ఇందులోనూ కనిపిస్తున్నాడు. జుట్టుకి క్లిప్‌ పెట్టుకుని కనిపిస్తున్నాడు. ప్రభాస్‌ సైతం మీసాలు తీసేసి ఉన్నాడు. అలా ఇది `సాహో`, `రాధేశ్యామ్‌` సినిమా షూటింగ్‌ టైమ్‌లో చేసుకున్న పార్టీ అని అర్థమవుతుంది. 
 

77

ఈ రేర్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ట్విట్టర్‌లో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ప్రభాస్‌, నాగ్‌, ఎన్టీఆర్‌ ఇలా ఒకేపార్టీలో కలిసి డాన్స్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ వీడియోని మీరు కూడా ఈ కింద ఇచ్చిన ట్విట్టర్‌ లింక్‌లో చూడొచ్చు. 
Twitter Link : నాగార్జున, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అఖిల్‌ రేర్‌ డాన్స్ వీడియో

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories