ఆ విషయంలో నాగచైతన్యకి సమంత రేటింగ్‌, మహేష్‌ బాబుకి సమానంగా.. ఆ ప్రేమే కారణమా?

First Published Jun 25, 2024, 12:16 PM IST

సమంత దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది. చైతూతో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆయనకు ఓ రెండు విషయాల్లో రేటింగ్‌ ఇచ్చింది సమంత. 
 

Samantha ruth prabhu

నాగచైతన్య, సమంత కలిసి నటించారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకి విడిపోయారు. పదేళ్ల టైమ్‌ స్పాన్‌లోనే వీరి లైఫ్‌లో అన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. ఎవరికివారు ఒంటరిగానే ఉంటున్నారు. సమంత అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు చేయడంస్టార్ట్ చేసింది. ఆ మధ్య ` మా ఇంటి బంగారం` అనే సినిమాని ప్రకటించింది. మరోవైపు హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది.  

ఇదిలా ఉంటే సమంత, నాగచైతన్య `ఏం మాయ చేసావె` సినిమాలో కలిసి నటించారు. ఇది చైతూకి రెండో మూవీ కాగా, సమంతకి ఫస్ట్ సినిమా. అయినా ఇద్దరు ఫ్రెష్‌ పెయిర్‌గా సందడి చేశారు. వీరి మధ్య లవ్‌, రొమాన్స్ అద్భుతంగా పండాయి. ఆడియెన్స్ దాన్ని అంతే బాగా ఎంజాయ్‌ చేశారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌లో ఇద్దరు స్టార్స్ అయ్యారు. గౌతమ్‌ మీనన్‌ టేకింగ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. 

నాగచైతన్యతో ఈ సినిమా సమయంలోనే స్నేహం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారింది. అయితే ఆ ప్రారంభంలోనే సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతూకి ఆయన క్వాలిటీస్‌ పరంగా రేటింగ్‌ ఇచ్చింది. రొమాన్స్ లో ఆయన కార్తీక్‌ పాత్రకి పదికి పది మార్కులు వేసింది. కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్ అంటూ కితాబిచ్చింది. తన పాత్రకి రొమాన్స్ లో 3.5 మార్కులు, సమంతకి ఐదు మార్కులు వేసుకుంది. తాను అంతగా రొమాంటిక్‌ కాదని చెప్పింది. 

లుక్స్ పరంగా రేటింగ్‌ ఇచ్చింది సమంత. స్టార్‌ హీరోల్లో ఎవరు బాగుంటారో చెప్పింది. తన రేటింగ్‌ ఇచ్చింది. ఇందులో కొందరి పేర్లు చెప్పగా, మహేష్‌ బాబుకి పదికి పది రేటింగ్‌ ఇచ్చిన సమంత, ఎన్టీఆర్‌కి 9.5 రేటింగ్‌, హృతిక్‌  రోషన్‌ తనకు నచ్చడని షాకిచ్చింది. ఆయనకు ఏడు మార్కులు వేసింది. నాగచైతన్యకి ఏకంగా పది మార్కులు వేసింది. మరో ఆలోచనే లేదని చెప్పింది. రణ్‌బీర్‌ కపూర్‌కి 8 మార్కులు వేసింది సమంత. 
 

 `ఏం మాయ చేసావె` సినిమా గురించి చెబుతూ, ఈ సినిమా సమయంలో దర్శకుడు గౌతమ్‌ తనకు స్టోరీ ఏంటో చెప్పలేదని, ఆయన సినిమాలో ఛాన్స్ రావడమే గొప్పగా చేసినట్టు తెలిపింది. అయితే షూటింగ్‌లో ఏ రోజు డైలాగులు ఆ రోజు నేర్చుకుని చెప్పేదాన్ని, అలానే షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపింది సమంత. జేస్సీ పాత్రలో రెండు మూడు రోజులకు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పింది.

అయితే నాగచైతన్యని కలిసే సీన్‌లో టెన్షన్‌ పడిందట. మొదటిసారి ఆయన ఇంటి గేటు వద్ద ఉంటాడు, ఆయన్ని చూసి చేయి ఎత్తే సీన్‌లో చాలా నర్వస్‌ అయ్యానని, దీంతో షివరింగ్‌ వచ్చిందని, చేయి వణికిపోయిందని తెలిపింది. ఆ తర్వాత గౌతమ్‌ సార్‌ తనని కూల్‌ చేశాడని వెల్లడించింది సమంత. `ఏం మాయ చేసావే` అనంతరం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ కామెంట్స్ చేసింది. 
 

Latest Videos

click me!