నాగార్జునలో రొమాంటిక్ అండ్ కామెడీ యాంగిల్ ని కంప్లీట్ గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. వీళ్లిద్దరి కాంబినేషన్ వచ్చిన హలో బ్రదర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఈ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా సౌందర్య, రమ్యకృష్ణ నటించారు.