చైతుపై తన ప్రేమ బయటపెడుతూ శోభిత ఎమోషనల్ కామెంట్స్.. ఊయలలో ఇద్దరూ చూడ ముచ్చటగా..

First Published | Aug 10, 2024, 7:03 AM IST

నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత రెండో పెళ్ళికి రెడీ అయ్యారు. తెలుగు నటి శోభిత ధూళిపాలని చైతు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత రెండో పెళ్ళికి రెడీ అయ్యారు. తెలుగు నటి శోభిత ధూళిపాలని చైతు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నిన్న మొన్నటివరకు వీరి గురించి రూమర్స్ వస్తుండేవి. ఆ రూమర్స్ నిజం కావడంతో అంతా షాక్ అవుతున్నారు. 

మొత్తంగా అక్కినేని ఇంటికి కొత్త కోడలు వస్తుందనే విషయంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు శోభిత ఎవరు ? నాగ చైతన్యతో ఎలా పరిచయం ఏర్పడింది? వీళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు ? లాంటి విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. 


ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నాగ చైతన్యపై ప్రేమని తెలియజేస్తూ శోభిత ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది. కవిత్వంలోని లైన్స్ పోస్ట్ చేస్తూ చైతుపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పింది. 

నా తల్లి మీకు ఏమైనా కావచ్చు.. ఏమైనప్పటికి, మా తండ్రి నీకు ఎలా బంధువు ? మీరు నేను ఎప్పుడు ఎలా కలిసినా.. మన హృదయాల్లో ప్రేమ ఉంది.. మన హృదయాలు ఎర్రటి భూమిలా మారి వర్షపు జల్లుల్లో తడచిపోతున్నాయి. విడిపోవడానికి మించి మనం కలసిపోయాం అంటూ శోభిత కవిత్వం పోస్ట్ చేసింది. 

Naga Chaitanya-Sobhita Dhulipala

నిశ్చితార్థం తర్వాత చైతూతో రొమాంటిక్ గా ఊయలలో కూర్చున్న ఫోటోలని శోభిత షేర్ చేసింది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఈ ఫొటోస్ లో చైతు శోభిత చూడ ముచ్చటగా ఉన్నారు. 

Latest Videos

click me!