మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ లో స్పెషల్ ఎట్రాక్షన్, పెద్ద స్కెచ్చే వేసారుగా

జానర్ విషయానికి వస్తే...మైథాలిజీ టచ్ తో సాగే సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది.  ఈ సినిమా స్క్రిప్టు ఇప్పటికే లాక్ చేసి...

Mokshagna


 నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ‘హను-మాన్‌’తో జాతీయ స్థాయిలో సత్తా చాటిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నారు. తన డెబ్యూ మూవీకి ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే ఎంచుకోవటంతో  మోక్షు ఎంట్రీపై అందరికీ నమ్మకం వచ్చేసింది. అలాగే  గతంలో చాలా బొద్దుగా కనిపించిన మోక్షు తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.  ఈ నేఫద్యంలో అసలు ఈ చిత్రం కథ జానర్ ఏమిటి..ఎప్పుడు లాంచింగ్ వంటి వివరాలు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.


అందుతున్న సమాచారం మేరకు మోక్షు తొలి చిత్రం గ్రాండ్ గా లాంచ్ చేయటానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. సెప్టెంబర్ 6 మోక్షు పుట్టిన రోజున ఈ సినిమా లాంచ్ అవుతుంది. ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి తన కుమారుడుని ఆశ్వీరదించేలా బాలయ్య ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులను ఈ లాంచ్ కు ఆహ్వానించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఈ సినిమా జానర్ విషయానికి వస్తే...మైథాలిజీ టచ్ తో సాగే సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది.  ఈ సినిమా స్క్రిప్టు ఇప్పటికే లాక్ చేసి టెక్నీషియన్స్ ,నటులను ఫైనలైజ్ చేసే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నారు.  ఇప్పటికే ఈ చిత్ర విషయమై నందమూరి కుటుంబ సభ్యులతో చర్చలు పూర్తయినట్లు తెలిసింది. బాలయ్య సలహాలు సూచనలకు అనుగుణంగా ప్రశాంత్‌ శైలి సోషియో ఫాంటసీ కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.


 అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే...ఈ సినిమాలో బాలయ్య ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ ఎపిసోడ్ సెకండాఫ్ లో వస్తుందని సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తుందని, అదే సినిమాకు యుఎస్ పి అవుతుందని భావిస్తున్నారట. ఆ ఎపిసోడ్ కు తన కుమారుడుని డామినేట్ చేసినట్లు ఉంటుందని  మొదట బాలయ్య ఒప్పుకోకపోయినా, తర్వాత సినిమా లాంగ్ రన్ కు,ఓపినింగ్స్ కు,బిజినెస్ కు భారీగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. 
 


సెప్టెంబరు తొలి వారంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ వారంలోనే 1వ తేదీన హైదరాబాద్‌లో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.  ఈ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. 

Mokshagna

  ఆ మధ్యన తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు. తాజాగా తన డెబ్యూ మూవీపై మరో అప్ డేట్ ఇచ్చాడు బాలయ్య వారసుడు. ఇందులో తన సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు మోక్షజ్ఞ. ఈ పోస్టుకు హైఫై, బ్లాస్ట్, ఫైర్ ఏమోజీలు జత చేశాడు. అలాగే తన పోస్టకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ట్యాగ్ చేశాడు

అలాగే ఇన్నాళ్లూ జనాల్లోకి పెద్దగా రాని   మోక్షజ్ఞ క్రమంగా యాక్టివ్ అవుతున్నాడు. నందమూరి అభిమాన సంఘ నాయకులని తరచుగా కలుస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న చిత్రాల సెట్స్ కి కూడా వెళుతున్నాడు. ఈ మధ్యన మోక్షజ్ఞ.. నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలో సందడి చేశాడు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. 

Latest Videos

click me!