ఈ సారి అంత మసాలా ఉండదు.. బిగ్‌ బాస్‌ టీం కీలక నిర్ణయం

First Published Aug 5, 2020, 11:16 AM IST

కరోనా నేపథ్యంలో వినోద రంగం పూర్తిగా కుదేలయిపోయింది. గత నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్ని పూర్తిగా ఆగిపోయాయి. సీరియల్స్‌ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా పూర్తి స్థాయిలో యాక్టివి ప్రారంభం కాలేదు. తాజాగా బిగ్‌ బాస్ కొత్త సీజన్‌ ప్రారంభానికి రెడీ అవుతుండటంతో టీఆర్పీలకు ఊపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు.

కరోనా కారణంగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 షో నిర్వాహణలో చాలా మార్పులు చేస్తున్నారు. కంటెస్టెంట్లు ముందుగా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాలన్న నిబంధన విథించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో హౌజ్‌లో కూడా అవసరాన్ని బట్టి ఫిజికల్ డిస్టాన్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
undefined
వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నాగార్జున కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరిద్దరు వ్యక్తులు తప్ప నాగ్‌ను ఎక్కవ మంది కలిసే అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోవిడ్‌ నింబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రోమో షూట్‌లో పాల్గొన్నాడు నాగ్‌.
undefined
అయితే తాజాగా ఈ సీజన్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సారి బిగ్ బాస్‌ వివాదాలకు ఏ మాత్రం తావు లేకుండా నిర్వహించాలని సూచించాడట నాగ్‌. అందుకు తగ్గట్టుగా షోలో గేమ్స్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారట నిర్వాహకులు.
undefined
గత సీజన్‌లలో కంటెస్టెంట్‌ల మధ్య వ్యక్తిగత విమర్శలతో పాటు, ఒకరి గురించి మరొకరు అభ్యంతరకరంగా మాట్లాడటం లాంటి ఘటనలు జరిగాయి. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ సారి షోలో అలాంటి వి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగ్‌ స్ట్రిక్ట్‌గా చెప్పాడని తెలుస్తోంది.
undefined
టాస్క్‌లతో పాటు గేమ్స్‌ అన్ని కూడా వ్యక్తిగత విమర్శలు, ఫిజికల్‌ ఎటాక్‌ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బిగ్‌ బాస్‌ షోకు అంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం వివాదాలే, మరి అవే లేకపోతే షో గతంలో సాధించినంత విజయం సాధిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
undefined
click me!