Naa Saami Ranga : ‘నా సామిరంగ’ అనిపించిన నాగార్జున.. అంతటా బ్రేక్ ఈవెన్ పూర్తి.. లాభం ఎంతంటే?

First Published | Jan 22, 2024, 4:32 PM IST

2024 సంక్రాంతికి కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ అనిపించారు. ఎందుకంటే... Naa Saami Ranga మూవీ కేవలం ఎనిమిదిరోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక లాభాల భాటలో నడుస్తోంది.

Nagarjuna Naa Saami Ranga movie Break Even in all Areas NSK

అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిల్మ్ ‘నా సామిరంగ’ Naa Saami Ranga  థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటిజివ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది.

Nagarjuna Naa Saami Ranga movie Break Even in all Areas NSK

‘నా సామిరంగ’ సినిమా పరిధిలో మాత్రం వసూళ్లు రాబడుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ చిత్రాల కన్నా త్వరగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న సినిమాగా Naa Saami Ranga Movie నిలిచింది. 
 


అయితే, ఈ చిత్రం కలెక్షన్ల విషయానికొస్తే... ఇప్పటి వరకు మొత్తంగా రూ.44.8 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్లు జరిగింది. ప్రస్తుతం అందుకున్న కలెక్షన్లతో పూర్తిగా లాభాల భాటలో నడుస్తోంది.

అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రూ.22 కోట్ల షేర్ రాబట్టింది. ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తుండటంతో లాభాలు ఆర్జించనున్నారు. 

ఇక ‘నా సామిరంగ’ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటంతో రూ.50 కోట్ల మార్క్ ను కూడా ఈ రెండ్రోజుల్లో చేరుకోనుందని తెలుస్తోంది. అటు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజా సజ్జ ‘హనుమాన్’ను తట్టుకొని ఈ సినిమా నిలబడటం హాట్ టాపిక్ గ్గా మారింది. 
 

రెండేళ్ల కింద ‘బంగార్రాజు’తో నాగార్జున సంక్రాంతి కింగ్ గా నిలిచారు. మరోసారి ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’తో మంచి ఫలితాన్ని అందుకొని మళ్లీ కింగ్ అనిపించుకున్నారు. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఆషికా రంగనాథ్ మిర్నా మీనన్, రుక్సార్ హరోయిన్లు గా నటించారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.  

Latest Videos

click me!