నాగ చైతన్యని నొప్పించకుండా నాగార్జున సమాధానం..ఆ సత్తా ఎవరికీ లేదు, రాంచరణ్ పై క్రేజీ కామెంట్స్ 

First Published | Sep 16, 2024, 5:19 PM IST

టాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే వెంటనే వినిపించే మాట కింగ్ నాగార్జున. నాగార్జున అందగాడు మాత్రమే కాదు వేల కోట్లకి అధిపతి కూడా. నాగార్జున ఒక సందర్భంలో జయప్రద హోస్ట్ గా చేసిన ఇంటర్వ్యూకి అతిథిగా హాజరయ్యారు. 

టాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే వెంటనే వినిపించే మాట కింగ్ నాగార్జున. నాగార్జున అందగాడు మాత్రమే కాదు వేల కోట్లకి అధిపతి కూడా. నాగార్జున ఒక సందర్భంలో జయప్రద హోస్ట్ గా చేసిన ఇంటర్వ్యూకి అతిథిగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున జయప్రదతో అనేక విషయాలు పంచుకున్నారు. 

జయప్రద కూడా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. శివ చిత్రంలో మీరు హీరో కాకపోతే ఇంకెవరైతే బావుంటుంది అని జయప్రద ప్రశ్నించారు. నాగార్జున మొహమాటం లేకుండా శివ చిత్రంలో యాక్ట్ చేసే సత్తా ఇంకెవరికీ లేదు నాకు తప్ప అని సమాధానం ఇచ్చారు. ఇతరులని ఆ చిత్రంలో ఊహించడం కూడా కష్టమే అని అన్నారు. 


ఏమాయ చేశావే, గీతాంజలి ఈ రెండు చిత్రాలలో ఏది బెస్ట్ అని అడుగగా.. తన కొడుకు నాగ చైతన్యని నొప్పించకుండా.. ఏమాయ చేశావే డిఫెరెంట్ స్టోరీ.. కానీ బెస్ట్ మూవీ మాత్రం గీతాంజలి అని నాగార్జున సమాధానం ఇచ్చారు. 

జయప్రద మరో ప్రశ్న అడిగింది. ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ విషయంలో బెస్ట్ ఎవరంటే నాగార్జున అనే అంటారు. మీ తర్వాత డ్రెస్సింగ్ విషయంలో ఎవరు బెస్ట్ అని జయప్రద ప్రశ్నించింది. దీనికి నాగార్జున సమాధానం ఇస్తూ రాంచరణ్ అని బదులిచ్చారు. 

అదే విధంగా మీరు నటుడిగా, బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. ఈ రెండింటిలో దేనిలో మీరు బెస్ట్ అని అడిగింది. తన ప్రాధాన్యత ఎప్పుడూ నటనకే అని నాగార్జున తెలిపారు. అసలు తనని తానూ బిజినెస్ మాన్ అని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. 

Latest Videos

click me!