మహేష్ , రాజమౌళి చిత్రం లాంచ్ డేట్ ఫిక్స్, అరుదైన గిరిజన జాతుల స్కెచ్ లు

First Published | Sep 16, 2024, 3:20 PM IST

ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంభందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, ఆ మేరకు టీమ్ స్కెచ్ వేయిస్తోందని 


మహేశ్‌బాబు (Mahesh Babu)హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.   ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

దాంతో ఈ సినిమా ఎప్పుడు లాంచ్ కాబోతోంది,  ఎలా ఉండబోతోంది. అసలు కథ ఎలా సాగనుంది, ప్రస్తుతం సినిమా ఏ స్టేజిలో ఉంది, ఎప్పుడు మొదలు కావచ్చు వంటి విషయాలు సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారాయి. తాజాగా ఈ చిత్రం లాంచింగ్ డేట్ బయిటకు వచ్చింది. 
 


 ఈ సినిమా గ్లోబల్  అడ్వెంచర్ థ్రిల్లర్ . ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు  సమాచారం. ఇప్పటికే, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసారని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ  అవుతున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని రీతిలో ఇందులో మహేష్ బాబు కనిపిస్తారు. 



ఈ సినిమా పీరియడ్ డ్రామా అని, 18 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కథ ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతుందని, ఫారెస్ట్ ఎడ్వెంచర్ అని చెప్తున్నారు. ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంభందించిన రిఫరెన్స్ లు అలాగే ఉండబోతున్నాయని, ఆ మేరకు టీమ్ స్కెచ్ వేయిస్తోందని త్వరలోనే ఫైనలైజ్ చేసి కాస్ట్టూమ్స్ డిజైన్ చేయించబోతున్నారు.  ఇందుకోసం వందలాది  జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ ప్రారంభానికి ముందే వారి లుక్స్ ఏమిటనేది లాక్ చేయబోతున్నారు.


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు చిత్రం నిర్మాతలు ఈ సినిమాని దసరా సీజన్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారు. లాంచింగ్ సమయంలోనే ఈ సినిమా కాన్సెప్టు, ఎవరెవరు నటించనున్నారు, టెక్నీషియన్స్ ఎవరు వంటి విషయాలును రివీల్ చేయనున్నారు. లాంచ్ జరిగినా వెంటనే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగదట. వచ్చే సంవత్సరంలోనే షూట్ మొదలవుతుందని ఈ లోగా టీమ్ మొత్తానికి ఇతర దేశాలకు పాస్ పోర్ట్, వీసా ల విషయాలు ఫైనల్ చేస్తున్నారు. 
 


ఈ సినిమా కోసం మహేష్ జిమ్ కు వెళ్లి కష్టపడి తనను తాను మొత్తం మార్చుకుంటున్నారు.  రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తున్నారు. అలాగే ఇప్పటికి పిఎస్ వినోద్, కీరవాణిలను టెక్నీషియన్స్ గా ఎంచుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి.  వాస్తవానికి జూన్ నుంచి షూటింగ్ మొదలు అయ్యేలా ప్లాన్ చేసారు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. లొకేషన్ హంట్ బాగా లేటైందని తెలుస్తోంది. 

 
ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్‌ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం.  అడ్వేంచర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు  సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా.

దీంతో  ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు.  అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. 


 మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. 


ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు  కథని  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.  

Latest Videos

click me!