సమంత సినిమాల పరంగా తిరుగులేని స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో అయితే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో కలసి నటించింది. సమంత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో నాగ చైతన్యతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ మూడేళ్ళ తర్వాత విడిపోయారు.