ఆకు కూరలు, రోటిపచ్చడి.. నాగార్జున భోజనం ప్లేటులో తప్పకుండా ఉండేవి ఏంటో తెలుసా..?

First Published | Sep 22, 2024, 7:37 PM IST

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. 60 ఏళ్ళు దాటి వయసు పరుగులు పెడుతున్నా.. ఇంకా ఇంత యంగ్ గా ఎలా ఉన్నారు అంటే.. నాగార్జున చెప్పిన ఫుడ్ సీక్రేట్ ఎంతో తెలుసా..? 

టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ నాగార్జునను చూస్తే.. ఆయన నిజంగా 65 ఏళ్ళు ఉంటాయని ఎవరైనా నమ్ముతారా..? కాని ఇది నిజం నాగార్జున వయస్సు పరుగులుపెడుతోంది.. కాని ఆయన మనసు, గ్లామర్ మాత్రం ఇంకా టీనేజ్ లోనే ఉంది. అందుకే నాగార్జున ఇప్పటికీ నవ యువకుడిలా కనిపిస్తాడు.. ఆయన హుషారు కూడా అలానే ఉంటుంది. 
 

అమృతం తాగిన దేవతల మాదిరి నాగార్జున కూడా ఇంత యవ్వనంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని అందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ ఆయనకు అమ్మాయిల్లో ఫాలోయింగ్ అలానే ఉంది. టాలీవుడ్ ఆయనకు మన్మధుడు అనేబిరుదు కూడా ఇచ్చింది.

ఈక్రమంలో అటు సినిమాలు, ఇటు బిజినెస్ లు అన్నీ చూసుకుంటూ.. అంతప్రెజర్ లో కూడా ఇంత ప్రశాంతంగా ఉందటం మాటలు కాదు. అయితే నాగార్జున ఇంత వయస్సులో కూడా ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారు.

అంత ఫిట్ గా ఉండటానికి ఆయన ఏం చేస్తున్నారు. ముందు అసలు ఆయన ఏం తింటారు అని చాలామందికి డౌట్ ఉంది. ఆయన తినేదేంటో చెపితే మేము కూడా అదే ఫాలో అవుతాం కదా అని అడిగే యువత కూడా ఉన్నారు. 

జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?


అయితే ఈ విషయంలో ఆయన రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ఓ మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనేమి కడుపు మార్చుకుని కసరత్తులు చేయను అన్నారు. హ్యాపీగా అన్నీ తింటాను. కడుపు నిండా తింటేనే కదా.. శక్తి వచ్చేది అని అన్నారునాగ్. 

అంతే కాదు తన భోజనం ప్లేట్ లోఏమేమి ఉంటాయో కూడా వివరించారు నాగార్జున. నాగ్ వైట్ రైస్ తినరట. బ్రౌన్ రైస్ లోకి  నెయ్యి వేసుకుని.. రెండు మూడు రకాల ఆకు కూరలు తింటాను.. అంతే కాదు రోజు ఫిష్ కాని చికెన్ కాని ఏదొ ఒకటి ఉండాల్సిందే. ఇక రోటి పచ్చడి.. ఆతరువాత పెరుగు లేకుండా నా భోజనం కంప్లీట్ అవ్వదు అన్నారు నాగార్జున. 

శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇలా హ్యాపీగా కడుపునిండా తింటాను అని చెప్పారు నాగ్. బయట మాత్రం నాగార్జున తినకుండా కడుపు మార్చుకుని వర్కౌట్లు చేస్తున్నాడేమో.. ఆయన మన తిండి ఎందుకు తింటారు అంటూ రకరాల మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఆయన మాత్రం మన అచ్చతెలుగు భోజనం హ్యాపీగా తింటాను అన్నారు. 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో
 

అక్కినేని వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగార్జున. నాగేశ్వరావు మాదిరిగానే ఆయన కూడా కమర్షియల్ గా ఆలోచిస్తారు. ఇటు సినిమాలు చేసుకుంటూనే.. తన ఫ్యామిలీ బిజినెస్ ను కూడా పరుగులు పెట్టించాడు నాగ్. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్చెస్ట్ హీరోగా నిలిచారు. 

ఇక నాగేశ్వరావు లెగసీని కాపాడుతూ.. స్టార్ హీరోగా ఎదిగిన నాగార్జున... తనతనయులను మాత్రం స్టార్ హీరోలను చేయలేకపోయారు. నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరు హీరలుగా కొనసాగుతున్నా.. స్టార్ డమ్ మాత్రం రాలేదు. నాగచైతన్య... టైర్ 2 హీరల లిస్ట్ లో ఉన్నారు. హీరోగా తనను తాను నిరూపించుకున్నారు. 

నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే,
 

కాని అఖిల్ మాత్రం హీరోగా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. ఒకటీ రెండుసినిమాలు యావరేజ్ టాక్ తప్పించి.. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. టాలీవుడ్ హీరోగా నిలబడితేచూడాలని నాగ్ కోరకుంటున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను హోస్ట్ చేస్తున్నాడు నాగార్జున. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

Latest Videos

click me!