ప్రభాస్ నెంబర్ 1, మరి పాన్ ఇండియా హీరోగా సెకండ్ ప్లేస్ ఏ హీరోదో తెలుసా...?

First Published | Sep 22, 2024, 6:30 PM IST

పాన్ ఇండియా సినిమాను పరిచయం చేసింది టాలీవుడ్.. మన హీరోలే పాన్ ఇండియాను ఏలుతున్నారు. ప్రభాస్ నెంబర్ 1 గా నిలిచాడు. ఇక పాన్ ఇండియా హీరోలలో నెంబర్ 2 ఎవరు..? సెకండ్ ప్లేస్ సాధించిన స్టార్ ఎవరోతెలుసా..? 

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మ్యానియా నడుస్తోంది. మన తెలుగు హీరోలు సినిమా చేసి.. పాన్ ఇండియాను దున్నేస్తున్నారు. అన్ని భాషల్లో అభిమానులను సంపాధించుకుంటున్నారు. బాహుబలితో స్టార్ట్ అయిన ఈవేవ్.. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. 

టాలీవుడ్ నుంచి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించి.. ఐదు భాషలకు పైగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ తో.. అన్ని భాషల్లో మన సినిమాలను, మన కథలను ఆధరిస్తున్నారు. 

జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?

కాని ఒకప్పుడు ఇండియన్ ఫిల్మస్ ఇండస్ట్రీని ఏలిన బాలీవుడ్ కాని, తమిళ్ కాని పాన్ ఇండియా సినిమాలను ఇవ్వలేకపోతున్నాయి. కాగా పాన్ ఇండియా హీరోలలో  ప్రస్తుతం నెంబర్ వన్ గా ఉన్నాడు ప్రభాస్. పాన్ ఇండియాలో ఇంత క్రేజ్ ఉన్న హీరో మరొకరు లేరు అనేచెప్పాలి. 

ఇక పాన్ ఇండియా హీరోలలో ప్రభాస్ నెంబర్ 1గా ఉన్నాడు సరే ..మరి ప్రభాస్ తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్న హీరో ఎవరు..? ఆయన తెలుగు హీరోనా..? లేక ఇంకెవరైన హీరో ఉన్నాడా అనేది.. చాలా మంది అనుమానం. అయితే ప్రభాస్ తరువాత ప్లేస్ లో ఉన్న హీరో ఎవరు..? 

శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..?


పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తరువాత ఉన్న హీరో మరెవరో కాదు బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్. అవును ప్రభాస్ తరువాత పాన్ ఇండియా హీరోలలో ఆయన రెండో స్థానం సంపాదించుకున్నారు. 

బహుబలి నుంచి కల్కీ వరకూ ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే.. షారుఖ్ ఖాన్ ఆమధ్య పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్ల మర్క్ ను సాధించడంతో పాటు.. పాన్ ఇండియాను ఇంప్రెస్ చేశారు. అందుకే షారుఖ్ ఖాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 

జానీ మాస్టర్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్

ఇకఫస్ట్ ప్లేస్ ను ప్రభాస్ ను కాదని.. ఇప్పట్లో ఎవరు సాధించలేరు అనేది నిజం. అయితే షారుఖ్ ప్లేస్ మాత్రం రీ ప్లేస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకుంటే షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు సాధించాయి. ఆతరువాత వచ్చిన డంకీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 

అమితాబచ్చన్ కు నిద్రలేకుండా చేసిన ఐశ్వర్య రాయ్..

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్.. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు గా మారారు. ఇక రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈమూవీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. సూపర్ హిట్ అయ్యి.. 1000 కోట్లు వసూలు చేస్తే.. షారుఖ్ ప్లేస్ కు సమానం అవుతుంద.ి

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో...

అటు ఎన్టీఆర్ నుంచి దేవర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. ఇక ఈమూవీ ప్రమోషన్స్ ను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా చేస్తున్నారు. ఈసినిమా సంచలనంగా మారితే.. షారుఖ్ ప్లేస్ కు పొగ పెట్టినట్టే. అవుతుంది. ఇక ప్రభాస్ ప్లేస్ కు ఏ డోకా లేదు కాని.. షారుఖ్ ప్లేస్ డౌట్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఇక ఈ ఇద్దరు హీరోలతో పాటు.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించాడు. ఇప్పుడు పుష్ప 2 తో ఐకాన్ స్టార్ కూడా పోటీకి వస్తున్నాడు. ఈ ముగ్గురుహీరోలు రంగంలోకి దిగితే.. బాలీవుడ్ హీరోల పరిస్థితి ఏంటీ అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక టాలీవుడ్ ను తలతన్నేవారు ఈ దరిదాపుల్లో ఉండరనే చెప్పాలి. ఒక వేళ వచ్చినా.. వారు ఆ స్థాయిని అందుకోడానికి చాలా టైమ్ పడుతుంది. 
 

Latest Videos

click me!