జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..? కారణం ఏంటి..?

First Published | Sep 22, 2024, 5:10 PM IST

సహజ నటి జయసుధ ను ఓ హీరోయిన్ కొట్టిందా..? జుట్టుపట్టి లాగి మరీ కొట్టిన ఆ హీరోయిన్ ఎవరు..? అసలు వారి మధ్య కొట్లాట ఎందుకు వచ్చింది. స్వయంగా వెల్లడించిన జయసుధ ఏమన్నదంటే..? 

టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల కొరత వచ్చింది కాని.. అచ్చతెలుగు హీరోయిన్లు ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేశారు. తెలుగు తమిళంలో తెలుగు హీరోయిన్ల హవానే గట్టిగా నడిచేది. ఇక శారద లాంటి పాతతరం హీరోయిన్లు అయితే మలయాళ పరిశ్రమలో స్టార్లు గా వెలుగు వెలిగారు. 

కాగా జయసుధ, జయప్రద, జయచిత్ర, శ్రీదేవి, అంజలి, కృష్ణ కుమారి, కృష్ణవేణి, జమున, విజయనిర్మల, అంజలి, జయంతి, వీరందరు ఒక ఎత్తు అయితే..మహానటి సావిత్ర ఒక ఎత్తు. ఇలా హీరోయిన్లు తెలుగు భూముపై పుట్టి.. తెలగు, తమిళ, కన్నడ పరిశ్రమలను ఏలారు. ఆతరువాత రంభ, విజయశాంతి,లాంటివారు తెలుగు హీరోయిన్లుగా స్టార్ డమ్ ను పొందారు. 

Also Read: శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇక అలనాటి హీరోయిన్లలో సహజనటిగా పేరుతెచ్చుకున్నారు జయసుధ. ఆమె నటన, అందానికి అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఉండేవారు. జయసుధ సినిమాలకు భారిగా డిమాండ్ ఉండేది. అంతే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు,  మురళీ మోహన్, మోహన్ బాబు లాంటి ఎంతో మంది హీరోల సరసన  జయసుధ ఆడిపాడింది. 

Also Read: దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో ,...


జయసుధతో చాలామంది కో ఆర్టిస్ట్ లు నటించేవారు. తోటి హీరోయిన్లు ఎంతో సఖ్యతతో ఉండేవారు. అందరు క్లాబ్ గా ఏర్పడి... ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. కాని కొంత మందిలో మాత్రం కోల్డ్ వార్ నడిచేది. మరికొంత మంది హీరోయిన్లు మాత్రం డైరెక్ట్ గానే గొడవలు పడేవారట. 
 

Also Read:జానీ మాస్టర్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్

ఈక్రమంలో జయసుధతో ఓ సందర్భంలో ఓ హీరోయిన్ గొడవపడి కొట్టుకునే స్థాయికి వచ్చిందట. ఆ గొడవ పెద్దదయ్యి.. షూటింగ్ లోనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కటకటాల రుధ్రయ్య. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర. 

అవును ఈ విషయాన్ని జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు.  ఆమె మాట్లాడుతూ..  కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరగుతోంది. ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను. కాని జయచిత్ర పొట్టిగా ఉండటంతో.. నన్ను హీల్స్ తీయ్యమంది. ఎందుకుంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్. 

Also Read: అమితాబచ్చన్ కు నిద్రలేకుండా చేసిన ఐశ్వర్య రాయ్..

అవును ఈ విషయాన్ని జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు.  ఆమె మాట్లాడుతూ..  కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరగుతోంది. ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను. కాని జయచిత్ర పొట్టిగా ఉండటంతో.. నన్ను హీల్స్ తీయ్యమంది. ఎందుకుంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్. 

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అప్పుడే నేను హీల్స్ తీసేశాను. కాని ఎందుకో తెలియదు మాట మాట పెరిగింది. సినిమా కోసం సీన్లో కొట్టుకోవాల్సింది.. జుట్టు జుట్టు పట్టుకుని నిజంగానే కొట్టుకోవడం మొదలు పెట్టాము. అందరు సినిమా సీన్ అనుకుని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. మేము కూడా రెచ్చిపోయి కొట్లాడుకున్నాము అని అన్నారు జయసుధ. 

Also Read:

ఇక అప్పుడు జరిగిందేమి ఆతరువాత ఎవరూ మనసులో పెట్టుకోలేదన్నారు జయసుధ. తరువాత రోజుల్లో కూడా కలిసి మాట్లాడుకునేవారం. ఫంక్షన్లు పార్టీలకు వెళ్ళేవారము అని అన్నారు జయసుధ. అప్పుడు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తనకు తెలియదన్నారు జయసుధు. 

అప్పట్లో అంరదు కలిసి మెలిసి ఉండేవారు. గొడవులు.. మనస్పర్ధలు ఉన్నా.. అవి ఎంత వవరకో అంత వరకే ఉండేవి అన్నారు. ఇక జయసుధ సహజనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె టర్న్ అయ్యారు. 

Latest Videos

click me!