నాగార్జున డైట్ రొటీన్
డైలీ లైఫ్ స్టైల్ లో నాగార్జున ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారు. రోజూ భోజనం చేస్తారుగానీ వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. భోజనంలో తప్పనిసరిగా మూడు రకాల ఆకు కూరలు ఉండేలా చూసుకుంటారు. అదేవిధంగా చికెన్ లేదా చేపలు కూడా ఆహారంలో భాగమవుతాయి. ప్రోటీన్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న బ్యాలెన్స్‌డ్ డైట్‌ను పాటిస్తారు.
నాగార్జున తక్కువ మొత్తంలో తిన్నా, లిమిటెడ్‌గా స్వీట్స్ తీసుకోవడం, డిన్నర్‌ను చాలా త్వరగా పూర్తి చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలాగే, పెరుగు కూడా రోజూ ఆహారంలో తీసుకుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆహార పదార్థాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో నిపుణుల సలహా మేరకు ముందడుగు వేస్తానని ఆయన ఎప్పుడూ అంటుంటారు.