సినిమా ఇండస్ట్రీ అంటే అసలు ఇష్టం లేని నాగార్జున మాజీ వైఫ్.. రామానాయుడికి ఏం చెప్పిందో తెలుసా 

Published : Jul 14, 2024, 08:23 PM IST

మూవీ మొఘల్ గా గుర్తింపు పొందిన లెజెండ్రీ నిర్మాత రామానాయుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి అల్లరి నరేష్ వరకు చాలా మంది హీరోలతో ఆయన చిత్రాలు నిర్మించారు.రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె లక్ష్మి దగ్గుబాటి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

PREV
16
సినిమా ఇండస్ట్రీ అంటే అసలు ఇష్టం లేని నాగార్జున మాజీ వైఫ్.. రామానాయుడికి ఏం చెప్పిందో తెలుసా 

మూవీ మొఘల్ గా గుర్తింపు పొందిన లెజెండ్రీ నిర్మాత రామానాయుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి అల్లరి నరేష్ వరకు చాలా మంది హీరోలతో ఆయన చిత్రాలు నిర్మించారు. దాదాపు భారతీయ భాషలన్నిటిలో రామానాయుడు చిత్రాలు నిర్మించారు. అదే విధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. 

26

రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గురించి చెబుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామానాయుడు నిర్మాతగా రాణిస్తున్నప్పుడు ఆయన పిల్లలు సురేష్ బాబు, వెంకటేష్, కుమార్తె లక్ష్మి ముగ్గురికి చిత్ర పరిశ్రమ అంటే అసలు ఇష్టం లేదట. 

 

36

ముగ్గురూ తమ తండ్రికి డాడీ సినీ ఫీల్డ్ అనేది మన ఇంట్లో మీతోనే ఎండ్ అయిపోవాలి. మాకు ఇష్టం లేదు అని చెప్పారట. కూతురు లక్ష్మి కూడా అదే మాట చెప్పిందట. సురేష్ బాబు అయితే మేము చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవ్వము.. ఏదైనా బిజినెస్ చేసుకుంటాం అని చెప్పారట. 

46

కానీ చివరికి లక్ష్మి చిత్ర పరిశ్రమకి చెందిన నాగార్జుననే వివాహం చేసుకుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ విభేదాలతో విడిపోయారు. అది వేరే విషయం. ఇక సురేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. వెంకటేష్ టాప్ లీగ్ హీరో అయ్యారు. ఇండస్ట్రీ వద్దనుకున్న రామానాయిడు పిల్లలు ఏదో విధంగా ఇక్కడే రాణిస్తున్నారు. 

56

అప్పట్లో చిత్ర పరిశ్రమ అంటే ఇష్టం లేదని చెప్పిన లక్ష్మి.. ఇప్పుడు తన కొడుకు నాగ చైతన్య హీరోగా రాణిస్తుంటే చూసి సంతోషిస్తున్నారు. వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు ముందుగా కృష్ణ కోసం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కృష్ణ ఆ చిత్రం చేయలేదు. ఇక మరో హీరో ఎవరు అనుకుంటున్న తరుణంలో.. కొత్త హీరో అయితే ఓకేనా అని రాఘవేంద్ర రావుని రామానాయుడు అడిగారట. ఓకె అని చెప్పారట. 

66

ఎవరా కొత్త హీరో అని అడిగితే మా అబ్బాయే వెంకటేష్ అని చెప్పారట. ఆ టైం లో వెంకీ ఫారెన్ లో చదువుకుంటున్నారు. వెంటనే రామానాయుడు వెంకటేష్ కి ఫోన్ చేసి నీతో ఒక సినిమా అనుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారట. తండ్రి కోసం వెంకటేష్ ఒప్పుకున్నారు. ఆ విధంగా వెంకీ తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టారు. 

click me!

Recommended Stories