ప్లాన్‌ మార్చేసిన శ్రీలీల.. స్టార్‌ హీరో సినిమాతో బాలీవుడ్‌ షిఫ్ట్.. ఏకంగా రెండు ప్రాజెక్ట్ లు?

Published : Jul 14, 2024, 06:36 PM IST

క్రేజీ బ్యూటీ శ్రీలీల తెలుగులో వరుస ఫ్లాప్‌ ల అనంతరం రూట్ మార్చింది. ఆమె ప్లాన్‌ ఛేంజ్‌ చేసి బాలీవుడ్‌ కి షిఫ్ట్ కాబోతుందట.  

PREV
17
ప్లాన్‌ మార్చేసిన శ్రీలీల.. స్టార్‌ హీరో సినిమాతో బాలీవుడ్‌ షిఫ్ట్.. ఏకంగా రెండు ప్రాజెక్ట్ లు?

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. రెండేళ్లు టాలీవుడ్‌ని ఉక్కిరి బిక్కిరి చేసింది. స్టార్‌ హీరోయిన్లని సైతం షాక్‌ కి గురి చేసింది. వాళ్లకి దక్కాల్సిన అవకాశాలను సొంతం చేసుకుని అందరు భామలకు వణుకు పుట్టించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ పది సినిమాలకు సైన్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. 
 

27

కానీ ఈ బ్యూటీ కి హిట్ల కంటే పరాజయాలే ఎక్కువగా ఎదురయ్యాయి. వరుసగా ఆఫర్లు రావడంతో ఆవేశంలో అన్నింటికి సైన్‌ చేసుకుంటూ వెళ్లింది. టైమ్‌ లేక కొన్ని ప్రాజెక్ట్ లను వదిలేసింది కూడా. అందులో `ధమాఖా`, `భగవంత్‌ కేసరి` మాత్రమే ఫర్వాలేదనిపించాయి కానీ మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో, అంతే వేగంగా పడిపోయింది. 
 

37

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `రాబిన్‌ హుడ్‌`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలున్నాయి. రవితేజతో మరో సినిమా చేస్తుంది. తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తుంది శ్రీలీల. కానీ ఆమె ప్లాన్‌ ఛేంజ్‌ చేసింది. టాలీవుడ్‌ని పక్కన పెట్టి బాలీవుడ్‌పై ఫోకస్‌ చేసింది. అక్కడ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది. 
 

47

శ్రీలీలకి లేటెస్ట్ గా ఓ స్టార్‌ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందట. వరుణ్‌ ధావన్‌తో ఆమె సినిమా చేయబోతుందని తెలుస్తుంది. వరుణ్‌ ధావన్‌ కొత్తగా ఓ మూవీకి కమిట్‌ అయ్యాడు. ఇందులో తెలుగు బ్యూటీస్‌ని తీసుకుంటున్నారు. 
 

57

శ్రీలీలని ఓ హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. ఆమెతోపాటు మృణాల్‌ ఠాకూర్‌ని మరో హీరోయిన్‌గా తీసుకున్నారట. ఇలా ఇద్దరు సౌత్‌ భామలతో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడు వరుణ్‌ ధావన్‌. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే వరుణ్‌ `బేబీ జాన్‌` సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌ కావడం విశేషం. 

67

ఇదిలా ఉంటే శ్రీలీల తెలుగులో గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ కాలేదు. లెహంగా ఓణీలోనే మెరిసింది. చీరలోనూ కనువిందు చేసింది. అడపాదడపా పొట్టి దుస్తులు వేసింది. కానీ స్కిన్‌ షో చేయలేదు. కానీ బాలీవుడ్‌ సినిమాలంటే అందాల విందు తప్పని సరి. మరి ఆమె గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రష్మిక మందన్నా బాలీవుడ్‌లో జెండా పాతింది. గ్లామర్‌ షోకి హద్దులు చెరిపేసింది. ఆమె దారిలోనే శ్రీలీల వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. 
 

77

ఇదిలా ఉంటే శ్రీలీల.. వరుణ్‌ ధావణ్‌తోపాటు మరో యంగ్‌ హీరో సినిమాలోనూ నటించబోతుందట. సైఫ్‌ అలీ ఖాన్‌ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతుంది. కునల్‌ దేశ్‌ ముఖ్‌ దర్శకుడిగా, మడాక్‌ ఫిల్మ్స్ ఓ సినిమాని రూపొందిస్తుంది. దీనికి `డైలర్‌` అనే పేరును అనుకుంటున్నారట. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సింది. ఇదే నిజమైతే ఇక శ్రీలీల బాలీవుడ్‌లో జెండా పాతబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories