అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన చిత్రాలతో ఎవరెవరు హిట్లు కొట్టారో తెలుసా.. ఆ ఒక్కటి వదలకుండా ఉండాల్సింది

Published : Jul 14, 2024, 07:17 PM IST

చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు కథలు చేతులు మారడం సహజం. హీరో బిజీగా ఉండడం వల్లో, కథ నచ్చకపోవడం వల్లో కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తుంటారు. ఆ విధంగా అల్లు అర్జున్ కూడా కొన్ని సూపర్ హిట్ చిత్రాలని వదిలేశారు.   

PREV
16
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన చిత్రాలతో ఎవరెవరు హిట్లు కొట్టారో తెలుసా.. ఆ ఒక్కటి వదలకుండా ఉండాల్సింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేశారు. ఆ తర్వాత వినోదంతో కూడిన మాస్ చిత్రాలు చేశారు. ఇప్పుడు పుష్ప రాజ్ గా తన విలక్షణ నటనతో పాన్ ఇండియా అభిమానులని అలరించే స్థాయికి ఎదిగారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో చాలా చిత్రాలని రిజెక్ట్ చేశారు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. 

 

26

జయం : అల్లు అరవింద్ బన్నీని మొదట తేజ దర్శకత్వంలో లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే తేజ అప్పట్లో అదిరిపోయే యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో దూసుకుపోతున్నారు. జయం కథ రెడీగా ఉంది. కానీ వెంటనే అల్లు అరవింద్ ప్లాన్ మారడం వల్ల జయం చిత్రాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ విధంగా జయం చిత్రం నితిన్ చేతుల్లోకి వెళ్ళింది. 

 

36

భద్ర : గంగోత్రి సూపర్ హిట్ కావడంతో బన్నీ నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేయాలి అనే చర్చ జరుగుతూ ఉంది. ఆ టైంలో బోయపాటి శ్రీను భద్ర కథని అల్లు అరవింద్ కి వినిపించారు. బన్నీకి కూడా కథ నచ్చింది. కానీ సుకుమార్ ఆర్య కథ చెప్పారు. ఆర్య చిత్రంలో యూత్ ఫుల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. భద్రలో కాస్త హెవీ డోస్ యాక్షన్ ఉంటుంది. దీనితో బన్నీ ఆర్య చిత్రంవైపే మొగ్గు చూపాడు. దీనితో బోయపాటి భద్ర చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎన్ని చిత్రాలు రిజెక్ట్ చేసినా బన్నీ.. భద్ర చిత్రాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండాల్సింది అని ఫాన్స్ ఇప్పటికీ అంటుంటారు. 

 

46

అర్జున్ రెడ్డి : సందీప్ రెడ్డి వంగా ముందుగా అర్జున్ రెడ్డి కథని అల్లు అర్జున్ కి చెప్పారట. తప్పకుండా హిట్ అవుతుందని తెలుసు. కనై బోల్డ్ గా ఉండడంతో తనకు ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుందో అని అల్లు అర్జున్ సాహసం చేయలేదు. ఆ తర్వాత ఈ కథ మరో ఇద్దరు హీరోల దగ్గరకి కూడా వెళ్ళింది. చివరికి ఆ అదృష్టం విజయ్ దేవరకొండని వరించింది. 

 

56

గీత గోవిందం : పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి విజయ్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రాన్ని ముందుగా బన్నీ కోసం అనుకున్నారు. హీరోయిన్ పాత్ర ఎక్కువగా డామినేట్ చేసేలా ఉంది. నేను ఈ మూవీ చేస్తే ఫ్యాన్స్ కి నచ్చదు అని బన్నీ రిజెక్ట్ చేశాడు. 

 

66

100 పర్సెంట్ లవ్ : సుకుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన 100 పర్సెంట్ లవ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్ కి ఈ మూవీ బాగా ప్లస్ అయింది. అల్లు అర్జున్ ఈ తరహా లవ్ స్టోరీ తనకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories