ఇదిలా ఉంటే `తండేల్` సక్సెస్‌పై నాగచైతన్య తండ్రి, స్టార్ హీరో నాగార్జున స్పందించారు. ఆయన ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా చైతూని చూసి గర్వపడుతూ ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ట్వీట్‌లో నాగార్జున చెబుతూ, `మై డియర్ సన్ నాగచైతన్య నిన్ను చూసి గర్వ పడుతున్నా` అని స్టార్ట్ చేశారు. నువ్వు హద్దులు దాటేశావ్, సవాళ్లని ఎదుర్కోవడం, కళని నీ హృదయాన్ని అంకితం చేయడం నేను చూశాను. `తండేల్` జస్ట్ ఒకసినిమా కాదు, నీ అవిశ్రాంత అభిరుచికి, పెద్ద కలలు కనే ధైర్యానికి, నీ కృషికి నిదర్శనం` అని చెప్పారు నాగ్.