Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?

Published : Mar 16, 2026, 12:27 PM IST

టాలీవుడ్ లో నాగార్జున బ్రాండ్ చాలా డిఫరెంట్.. 90వ దశకంలో టాలీవుడ్ ను ఊపేసిన హీరోలలో నాగ్ కూడా ఒకరు. 99 సినిమాలు చేసి.. 100వ సినిమాకు రెడీ అవుతున్న నాగార్జున కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? 

PREV
14
అక్కినేని వారసుడిగా..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టి.. ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ప్రారంభమైన ఈ సినీ వారసత్వం ప్రస్తుతం అఖిల్ వరకు కొనసాగుతోంది. ఈ కుటుంబానికి చెందిన ప్రతి హీరో కూడా తమ తమ ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అక్కినేని హీరోలకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను, అభిమానులను, ఇమేజ్ ను సాధించారు.

24
విభిన్న పాత్రలు చేసిన నాగార్జున

టాలీవుడ్ లో విభిన్న పాత్రలు చేశారు నాగార్జున. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో రొమాంటిక్ పాత్రలే ఎక్కువ. హీరోగా మాస్ క్యారెక్టర్స్ లో కూడా మెరిసి అద్భుతాలు చేశాడు. ఉపిరి లాంటి సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలవైపు అడుగులు వేసిన ఆయన.. రీసెంట్ గా క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. రజినీకాంత్ కూలీ సినిమాలో పవర్ ఫుల్ స్టైలీష్ విలన్ గా నాగార్జున నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. నాగార్జున కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాడు కానీ.. ఆయన ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర గురించి మీకు తెలుసా?

34
నాగార్జున డ్రీమ్ రోల్..

నాగార్జున కు ప్రస్తుతం 66 ఏళ్లు.. ఆయన దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇంత కాలంగా.. నాగార్జున చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఒకటుంది. అది ఆయన డ్రీమ్ రోల్. సూపర్ మాన్ తరహా పాత్రలో నటించాలని కింగ్ ఎప్పటి నుంచో అనుకున్నాడట. కానీ ఇప్పటి వరకు అలాంటి కథ లేదా పాత్ర ఆయన కెరీర్‌లో ఎవరు రాయలేదు, దర్శకులు చేస్తామని ముందుకు రాలేదు.

44
నాగార్జున 100 వ సినిమా

అయితే నాగార్జున వంటి స్టార్ హీరో ఒకసారి డేట్స్ ఇస్తే సూపర్ హీరో కథను తెరకెక్కించేందుకు అనేక మంది యువ దర్శకులు ఆసక్తి చూపుతున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ నాగార్జున మాత్రం తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సెలెక్టెడ్ ప్రాజెక్టులను మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

భవిష్యత్తులో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను నిజం చేసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories