హీరో అజిత్ కుమార్ రాబోయే ఏడాది కార్ రేసింగ్ షెడ్యూల్‌ను ఆయన మేనేజర్ సురేష్ చంద్ర తన ఎక్స్ (X) ఖాతాలో విడుదల చేశారు. అటు సినిమాలు.. ఇటు రేసులను అజిత్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు.
తమిళ స్టార్ హీరో, ప్రొఫెషనల్ కార్ రేసర్ అజిత్ కుమార్ మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వచ్చారు. ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆయన మేనేజర్ సురేష్ చంద్ర ఈ విషయంపై ఇచ్చిన సమాచారం అభిమానుల్లో జోష్ నింపింది.
24
అజిత్ కుమార్ రేసింగ్ (AKR) ప్రయాణం
'అజిత్ కుమార్ రేసింగ్' (AKR) పేరుతో సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న అజిత్.. దుబాయ్, అబుదాబి, మలేషియా, యూరప్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఆయన టీమ్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం, 2026 మార్చి 20 నుంచి 2027 జనవరి 17 వరకు ఆయన టీమ్ పలు కార్ రేసుల్లో పాల్గొననుంది.
34
సినిమాలు.. రేసులు బ్యాలెన్స్ చేస్తూ..
అజిత్ వరుసగా రేసుల్లో పాల్గొంటుండటంతో, ఆయన తర్వాతి సినిమా పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర స్పష్టత ఇచ్చారు. 'అజిత్ కుమార్ ఈ ఏడాది కొత్త సినిమాలో నటిస్తున్నారు. కార్ రేసుల మధ్య గ్యాప్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది' అని ఆయన తెలిపారు. రాబోయే ఏడాది కార్ రేస్ షెడ్యూల్‌ను కూడా ఆయన విడుదల చేశారు.
ఇటీవల అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు రేస్ ట్రాక్‌పైనా సత్తా చాటేందుకు సిద్ధమవ్వడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అజిత్ తర్వాతి సినిమా AK64కు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఒకటి, రెండు నెలల్లో వస్తుందని భావిస్తున్నారు.