ఏఎన్నార్‌కి తెలిస్తే కొడతాడని, బీర్‌ తాగడం కోసం నాగార్జున ఏం చేశాడో తెలుసా? ఇది ఊరమాస్‌ లెక్క

First Published | Nov 6, 2024, 4:24 PM IST

నాగార్జున తన తండ్రి, ఏఎన్నార్‌కి చెప్పకుండా చాలా కొంటె పనులు చేసేవాడట. అయితే ఈ క్రమంలో ఆయన బీర్‌ కూడా తాగేవాడట. ఆ రహస్యం బయటపెట్టాడు నాగ్‌. 
 

Nagarjuna Akkineni

సినిమా సెలబ్రిటీలకు ఆల్కహాల్‌ తీసుకోవడం కామన్‌. ఇంట్లో కొందరు. పార్టీలు, పబ్బుల్లో మరికొందరు ఇలా రాత్రి సమయంలో ఆల్కహాల్‌ తీసుకుంటారు. ఇప్పుడు పబ్‌ కల్చర్‌ పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీ పిల్లలు కూడా ఈజీగా పబ్‌లకు వెళ్లి మందేస్తుంటారు. పెద్ద స్టార్స్ అయితే ఇంట్లోనే తీసుకుంటారు.

ఇప్పుడు ఏదైనా ఈజీగా దొరుకుతుంది. అదే సమయంలో ఆ ఫ్రీడమ్‌ ఉంది. ఎవరైనా తీసుకునేంత స్వేచ్ఛ పెద్దలు ఇస్తున్నారు, పిల్లలు తీసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు, పిల్లలు చెడు అలవాట్లకు గురవుతున్నారంటే పెద్దలు మందలించేవాళ్లు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీలో కూడా ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నాన్న ఏఎన్నార్‌కి తెలియకుండా నాగార్జున చాలా చేసేవారట. ఈ క్రమంలో ఓ షాకిచ్చే క్రేజీ విషయాన్ని పంచుకున్నాడు నాగ్‌. అక్కినేనికి తెలియకుండా తాను చేసిన పని బయటపెట్టాడు. తాను బీర్‌ తాగేవాడట. దొంగచాటుగా ఆ పని చేసేవాడిని అని తెలిపారు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు ఇంట్లో చాలా సిస్టమాటిక్‌ ఫాదర్‌గా ఉండేవారు.

ఆయన పిల్లల విషయంలో చాలా స్టిక్ట్ గా ఉండేవారు. అల్లరి చిల్లరగా తిరగనిచ్చేవారు కాదు. వెంకట్‌, ఇతర ఆడపిల్లలంతా బాగా ఉండేవారు, కానీ నాగ్‌ మాత్రం కొంటె అట. తాను చాలా అల్లరి పనులు చేసేవాడట. ఇంట్లో పేరెంట్స్ ముందు దొరికిపోయేవాడట. 
 


నాగ్‌కి బీర్‌ తాగే ఆలవాటు ఉందట. ఇంకా చెప్పాలంటే రహస్యంగా అది చేసుకున్నాడట. ఏఎన్నార్‌కి తెలిస్తే కొడతాడని చెప్పి దొంగచాటుని ఆ బాటిల్‌ లేపేవాడట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోని వాడుకునేవాడట. అందులో స్టూడియోతోపాటు ఓ ఖాళీ ప్లేస్‌ కూడా ఉంది. అది ఫారెస్ట్ ని తలపిస్తుంది. తాను బీర్‌ తాగాలనుకుంటే నెమ్మదిగా బాటిల్‌ తీసుకుని ఆ చెట్లలోకి వెళ్లేవాడట. అక్కడ అయితే ఎవరూ చూడరని చెప్పి ఆ ఫారెస్ట్ లోకి వెళ్లి బీర్‌ తాగినట్టు తెలిపారు నాగ్‌.

ఆ మధ్య ఓ ప్రెస్‌ మీట్‌లో నాగార్జున ఈ విషయాన్ని చెప్పడం విశేషం. తనకు తెలియని ప్లేస్‌లు ఇందులో చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆ లెక్కన నాగ్‌ చేసే పనులు ఊరమాస్‌ లెక్క అని చెప్పొచ్చు. ఊర్లలో కుర్రాకారు ఇలా నే చేస్తుంటారు. నాగ్‌ సైతం అదే స్టయిల్‌ని ఫాలో అయినట్టు తెలుస్తుంది. 
 

Nagarjuna Akkineni

నాగార్జున ఆరు పదులు దాటినా ఇప్పటికీ యంగ్‌గానే ఉన్నారు 30ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. గత ముప్పై ఏళ్లుగా ఒకేలా తన బాడీని మెయింటేన్‌ చేస్తున్నారు. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు. తన డైట్‌ విషయాన్ని చెబుతూ, తాను అన్నీ తింటానని, కానీ రాత్రి పడక ముందే అన్నీ కంప్లీట్‌ చేస్తానని తెలిపారు నాగ్‌. వైన్ కూడా కొద్దిగా తీసుకుంటానని, నాన్‌ వెజ్‌తోపాటు, వెజ్‌ కూడా తీసుకుంటానని తెలిపారు. నాటు కోడి అంటే చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు రాత్రి పడుకునే ముందు కొంత స్వీట్‌ తీంటానని  వెల్లడించారు.

ఇక హీరోగా ఆయన బిజీగా ఉన్నారు. అయితే ముఖ్య పాత్రలతో అదరగొట్టబోతున్నారు. ధనుష్‌ హీరోగా రూపొందుతున్న `కుబేర` సినిమాలో రిచ్‌ రోల్‌ చేస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు రజనీకాంత్‌తో కలిసి `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నాగ్‌ది నెగటివ్‌ రోల్‌ అని సమాచారం. దీనికి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోకి హోస్ట్ గా చేస్తున్నారు నాగ్‌. 

Read more: లేటెస్ట్ ఓటీంగ్‌ సర్వే, డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు, నాగ్‌ ఫేవరేట్‌ ఈ వారం ఔట్‌?

also read: సినిమా రిలీజ్‌ అయ్యాక సాంగ్‌ షూటింగ్‌, ఫలితం చూశాక కూడా అంటే బాలకృష్ణకే సాధ్యం, రాజమౌళి నుంచి ఇది ఊహించలేం

Latest Videos

click me!