మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనితో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇండియాతో పాటు యుఎస్ లో కూడా గేమ్ ఛేంజర్ చిత్ర ఈవెంట్స్ నిర్వహించేలా నిర్మాత దిల్ రాజు ప్రణాళిక రాణిస్తున్నారు.