బాలకృష్ణ సినిమా ఓపెనింగ్‌కి గెస్ట్ గా నాగార్జున.. కెమెరా ఆన్‌ చేసి విష్‌ చేస్తే, రిజల్ట్‌ ఏంటో తెలుసా?

Published : Jun 30, 2025, 04:22 PM IST

బాలకృష్ణకి, నాగార్జునకి పడదు అంటుంటారు. ఇద్దరి మధ్య ఏవో గొడవలనే కామెంట్‌ వినిపిస్తుంటుంది. కానీ బాలయ్య సినిమా ఓపెనింగ్‌కి నాగార్జున రావడం విశేషం. కానీ ఫలితం.. 

PREV
15
బాలకృష్ణ, నాగార్జున మధ్య రూమర్‌

బాలకృష్ణ, నాగార్జునలకు పడదు అనే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అంటుంటారు. ఒకటి రెండు సార్లు ఈవెంట్లలో కలసి కనిపించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. 

కానీ ఆ కామెంట్‌ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ గ్యాప్‌ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్స్ మధ్య కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. 

మరి నిజంగానే వీరి మధ్య గొడవలు ఉన్నాయా? ఉంటే అవి ఎందుకు? ఇది కేవలం రూమర్‌ మాత్రమేనా అనేది మాత్రం ఎప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయింది.

25
బాలయ్య సినిమా ఓపెనింగ్‌కి నాగార్జున

ఈ క్రమంలో తాజాగా వీరికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ సినిమాకి సపోర్ట్ చేస్తూ నాగార్జున ముందుకు రావడం విశేషం. బాలయ్య మూవీ ఓపెనింగ్ లో నాగార్జున పాల్గొన్నారు. అంతేకాదు ఏకంగా కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

 బాలయ్యతోపాటు టీమ్‌ అందరికి విషెస్‌ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. కానీ ఈ మూవీ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటి? అనేది చూస్తే.

35
బాలయ్య `అశ్వమేథం` ఓపెనింగ్‌లో చిరంజీవితోపాటు నాగార్జున సందడి

బాలయ్య, కె రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి `అశ్వమేథం`. 1992లో విడుదలైన ఈ చిత్రంలో మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించగా, సోగ్గాడు శోభన్‌ బాబు ముఖ్య పాత్ర పోషించాడు. 

అశ్వినీదత్‌ నిర్మించారు. అప్పట్లో భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఓపెనింగ్‌లో చిరంజీవితోపాటు నాగార్జున కూడా గెస్ట్ లుగా పాల్గొన్నారు. 

జూన్‌ 25న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై పాటని చిత్రీకరించగా, చిరంజీవి క్లాప్ నిచ్చారు. నాగార్జున కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

45
`అశ్వమేథం`లో పోలీస్‌గా బాలయ్య

ఈ మూవీలో బాలకృష్ణ పైలట్‌గా నటించారు. శోభన్‌ బాబు పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. వీరిద్దరు అన్నదమ్ములు. ఓ కేసు విషయంలో విలన్‌ అయిన అమ్రీష్‌ పూరిని పట్టుకుని మట్టుపెడతాడు శోభన్‌ బాబు.

 కానీ చనిపోయింది కవలల్లో ఒకరు. తమ సోదరుడిని చంపేస్తారా అని మరో అమ్రీష్‌ పూరీ వీరిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో శోభన్‌ బాబు పలు అవమానాలు ఫేస్‌ చేసి సూసైడ్‌ చేసుకుంటాడు. అనంతరం బాలయ్య రంగంలోకి దిగి విలన్‌ ని అంతం చేయడం ఈ మూవీ కథ.

55
బాలయ్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా `అశ్వమేథం`

ఈ చిత్రం 1992 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదలైంది. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇది ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి, నాగార్జునలు సపోర్ట్ చేసినా ప్రయోజనం లేదు. బాలయ్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 

ఇక ఇప్పుడు బాలయ్య `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. సెప్టెంబర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories