Mahavatar Narsimha Collections: మహావతార్‌ నరసింహ సినిమా 49 రోజుల కలెక్షన్లు.. ఇలా చేస్తే కాసుల వర్షమే

Published : Sep 12, 2025, 09:30 PM IST

మహావతార్‌ నరసింహ మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. అదే సమయంలో సినిమా మేకర్స్ కి స్పష్టమైన సందేశాన్ని తెలియజేసింది. ఇలా చేస్తే కాసుల వర్షమే అనే విషయాన్ని చాటి చెప్పింది.  

PREV
15
సంచలనం సృష్టిస్తోన్న `మహావతార్‌ నరసింహ` మూవీ

ఈ ఏడాది ఇండియన్‌ సినిమాలో సరికొత్త సంచలనం ఏదైనా ఉందంటే అది `మహావతార్‌ నరసింహ` మూవీ. రిలీజ్‌కి ముందు ఈ మూవీని ఎవరు చూస్తారులే అనుకున్నారు చాలా మంది. దర్శకుడు కూడా ఇలాంటి కామెంట్లనే విన్నాడు. సినిమా కోసం తన ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాడు. తన సంకల్పబలంతో సినిమాని పూర్తి చేశాడు. ఎంతో ప్యాషన్‌తో మూవీని రూపొందించారు. తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ ఔట్‌పుట్‌ తీసుకొచ్చాడు. ఇండియాలో యానిమేషన్‌ చిత్రాల్లోనే బెస్ట్ మూవీగా తీర్చిదిద్దాడు.

25
కంటెంట్‌తో జనాల్లోకి వెళ్లిన `మహావతార్‌ నరసింహ`

అశ్విన్‌ కుమార్‌ ఈ మూవీని రూపొందించగా, హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై శిల్పా ధావన్‌, కుశల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా నిర్మించారు. జులై 25న ఈ మూవీ విడుదలైంది. పవన్‌ `హరి హర వీరమల్లు` విడుదలైన నెక్ట్స్ డే ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మొదటి రోజు కోటిన్నర వసూలు చేస్తే రెండో రోజు రెండు కోట్లకుపైగా రాబట్టింది. ఇలా రోజు రోజుకి ఈ మూవీ కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి.

35
`మహావతార్‌ నరసింహ` వసూళ్లు

తాజాగా `మహావతార్‌ నరసింహ` విడుదలై 49 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసినిమా ఇప్పటి వరకు ఎంత వరకు కలెక్ట్ చేసిందనేది చూస్తే. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లు దాటింది. గురువారం వరకు ఈ సినిమా రూ. 319కోట్లు రాబట్టింది. ఇందులో ఇండియాలో రూ.291కోట్లు రాబట్టగా, ఇండియా నెట్‌ రూ.247 కావడం విశేషం. ఇక ఓవర్సీస్‌లో రూ.28కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అనేక బాలీవుడ్‌ సినిమా రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం.

45
స్టార్స్ కాదు, కంటెంట్‌ ముఖ్యమని చెప్పిన సినిమాలు

కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో రూపొందిన `మహావతార్‌ నరసింహ` మూవీ ఇప్పుడు ఏకంగా మూడు వందల కోట్లు దాటడం మామూలు విషయం కాదు, ఎలాంటి ప్రమోషన్స్ లేదు, ఎలాంటి స్టార్‌ కాస్ట్ లేదు, ఎలాంటి హడావుడి లేదు, కేవలం కంటెంట్‌ ప్రధానంగానే ఈ మూవీ ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యింది. నెమ్మదిగా మౌత్‌ టాక్‌తోనే దూసుకుపోతుంది. సంచలనాత్మక విజయం సాధించింది. ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్ స్పష్టమైన సిగ్నల్‌ పంపింది. మంచి పాఠాన్ని నేర్పించింది. చాలా మందికి గుణపాఠాలు కూడా నేర్పించింది. ఏ సినిమాకైనా స్టార్‌ కాస్ట్ మూడు రోజులకే పరిమితం అని, అదే కంటెంట్ ఉంటే సినిమాకి సక్సెస్‌కి అవధుల్లేవని నిరూపించింది. సంచలనాలు సృష్టించవచ్చనే సందేశాన్నిచ్చింది.

55
మైథాలజీ, ఫాంటసీ, సూపర్‌ హీరో చిత్రాలకు ఆడియెన్స్ పట్టం

మేకర్స్ స్టార్స్ కోసం ఉబలాటం పడకుండా మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెరకెక్కిస్తే అదే ఆడియెన్స్ వద్దకు వెళ్తుందని ఈ చిత్రం నిరూపించింది. మరోవైపు జోనర్‌ పరంగానూ ఓ క్లీయర్‌ ఇండికేషన్‌ ఇచ్చింది. మైథాలజీ అంశాలు, ఫాంటసీ, సూపర్‌ పవర్స్ కథాంశంతో సినిమాలు చేస్తే అవి సంచలనాలు సృష్టిస్తాయనే విషయాన్ని ఈ మూవీ చాటి చెప్పింది. `కాంతార`, `హనుమాన్‌`, `మహావతార్‌ నరసింహ`, `కొత్తలోక` వంటి చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడు విడుదలైన `మిరాయ్‌` కూడా అదే విషయాన్ని నిరూపించింది. దీంతో మేకర్స్ ఎలాంటి సినిమా చేసినా అందులో ఈ ఎలిమెంట్లని కన్విన్సింగ్స్ గా, పర్‌ఫెక్ట్ బ్లెండ్‌ చేసేలా డిజైన్‌ చేస్తే ఆడియన్స్ కి సినిమా బాగా రీచ్‌ అవుతుందని చాటి చెప్పాయి. ఇలా `మహావతార్‌ నరసింహ` మూవీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించడమే కాదు, ఎలాంటి సినిమాలు తీయోచ్చు అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. ఇలా చేస్తే కాసుల వర్షమే అనే విషయాన్ని చెప్పింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories