వెంకటేష్‌ సినిమా టైటిలే `సంక్రాంతికి వస్తున్నాం`.. పిచ్చి పీక్‌లోకి వెళితే ఇలానే ఉంటుందేమో!

First Published | Nov 1, 2024, 12:14 PM IST

వెంకటేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్,‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్‌ ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 
 

#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju

విక్టరీ వెంకటేష్‌కి హిట్లు లేక చాలా రోజులవుతుంది. ఈ సంక్రాంతికి `సైంధవ్‌` బోల్తా కొట్టింది. సంక్రాంతి పండగ సీజన్‌ని కూడా క్యాష్‌ చేసుకోలేనంతగా డిజాస్టర్‌ అయ్యింది. తన బలం అయిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని పక్కన పెట్టి యాక్షన్‌తో వచ్చారు వెంకటేష్‌. దీంతో ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు సరైన ట్రాక్‌లో పడినట్టుగా అనిపిస్తుంది. తాజాగా ఆయన అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే `ఎఫ్‌ 2`,`ఎఫ్‌3` సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా బాగానే ఆడగా, రెండో సినిమా పెద్దగా సత్తా చాటలేకపోయింది. పైగా అందులో వరుణ్‌ తేజ్‌ మరో హీరో. భార్యలతో ఫ్రస్టేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రాలు కామెడీని పంచి మెప్పించాయి. ఇప్పుడు వెంకటేష్‌ సోలో హీరోగా అనిల్ రావిపూడి మరో మూవీ చేస్తున్నారు. వీరి కాంబోలు రాబోతున్న మూడో సినిమా ఇది. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


ఇక తాజాగా ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించింది టీమ్‌. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ పేరుని ప్రకటించడం విశేషం. ఈ టైటిల్‌ చాలా క్రేజీగా ఉంది. సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఆ విషయాన్ని తెలియజేసేలా, పదే పదే ఆడియెన్స్ లో, ఇంటస్ట్రీలో నానేలా ఏకంగా అదే పేరుని టైటిల్‌గా పెట్టారు. `సంక్రాంతికి వస్తున్నాం` అనేదే వెంకీ, అనిల్‌ రావిపూడి సినిమాకి టైటిల్‌ పెట్టడం విశేషం. ఇది చూడ్డానికి విచిత్రంగా, ఇంకా క్రేజీగా ఉంది. పిచ్చి పీక్ లోకి వెళితే ఇలానే ఉంటుందనేది ఈ సినిమా టైటిల్‌ ఉండటం విశేషం. టైటిల్‌ ఫన్నీగా ఉంది. ఇక ఫస్ట్ లుక్‌ సైతం క్రేజీగా ఉంది. టైటిల్‌లో సంక్రాంతి ముగ్గురు, కింద గన్‌ కనిపిస్తుంది.

ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీలతో కలిసి వెంకటేష్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో మీనాక్షిపై చేయి వేసి కోపంగా చూస్తున్నారు వెంకీ, పక్కన చీరలో ఐశ్వర్యరాజేష్‌ కూడా కాస్త సీరియస్‌గా కనిపిస్తుంది. ఇది క్రైమ్‌ కామెడీ మూవీగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండబోతుందన్నాయి ఈ టైటిల్‌, ఫస్ట్ లుక్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇందులో మీనాక్షి మాజీ ప్రియురాలిగా కనిపిస్తుందని, ఐశ్వర్యా రాజేష్‌ భార్యగా నటిస్తుందని టీమ్‌ తెలిపింది. భార్య చీరలో ఉంటే, ప్రియురాలు ట్రెండీ వేర్‌లో ఉంది. ఈ ఫ్యామిలీ ఎలిమెంట్లు `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` సినిమాని తలపించేలా ఉన్నట్టు తెలుస్తుంది. 

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ విషయం అందరికి తెలిసేలా, ఎవరూ దాన్ని చెప్పాల్సిన పనిలేకుండా ఏకంగా టైటిలే `సంక్రాంతికి వస్తున్నాం` అని పెట్టి ప్రమోషనల్‌ స్టంట్‌ని ప్రతిబింబించారు. మరి ఈ సినిమా ఆడియెన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పోస్టర్‌ చూస్తుంటే వెంకీ రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తున్నట్టు తెలుస్తుంది. వరుస పరాజయాల్లో ఉన్న వెంకీ ఈ సినిమాతో బయటపడతాడా? మళ్లీ పూర్వవైభవం పొందుతాడా? అనేది చూడాలి. 

read more: ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు.. ఆ రోజులు ఆయనతోనే పోయాయి.. మోహన్‌బాబు వ్యాఖ్యలు ఆయనకేనా?

Also read: ఆఫీస్‌ బాయ్‌ కారణంగా హిట్‌ కొట్టిన చిరంజీవి, ఫ్లాప్‌లో ఉన్న టైమ్‌లో అది పెద్ద ఊరటే!

Latest Videos

click me!