కింగ్ నాగార్జున .. టాలీవుడ్ మన్మధుడు. డీసెంట్ గా ఉండే చోట చాలా డీసెంట్ గా ఉంటాడు. రెబల్ అవ్వాలి అనుకుంటే రచ్చ చేస్తారు. పక్కా బిజినెస్ మ్యాన్.. లేడీ ఫ్యాన్స్ కు ఆల్ టైమ్ మన్మధుడు. 60 ఏళ్ళు దాటి వయస్సు పరిగెడుతున్నా.. కుర్రహీరోలకంటే కూడా ఎక్కువగా హుషారు చూపిస్తుంటాడు కింగ్
అయితే ఇండస్ట్రీ అన్న తరువాత డ్రింకింగ్ చాలా కామన్. ఆ అలవాటు లేని నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈక్రమంలో కింగ్ నాగార్జునకు ఉన్నఈ అలవాటను.. పెళ్ళి తరువాత అమల మాన్పించేశారట. భార్యగా తనభర్త చేత ఈ అలవాటు మాన్పించి.. భార్యంలే ఇలా ఉండాలి అనిపించుకున్నారట అమల.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈవార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే అమల వచ్చిన తరువాత నాగార్జున బాగా యాక్టీవ్ అయ్యారు. ఇక టాలీవుడ్ మన్మధుడిగా బిరుదు పొందిన ఆయన సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇఫ్పుడు కూడా అదే క్రేజ్ తో.. అదే ఊపును మెయింటేన్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు నాగ్.
Image: Nagarjuna AkkineniTwitter
అంతే కాదు టీవీ రంగంలో కూడా స్టార్ హోస్ట్ గా డబుల్ ఇమేన్ ను పొందారు కింగ్ గతంలో ఎవరుమీలో కోటీశ్వరుడు షోతో సందడి చేసిన నాగార్జున.. ప్రస్తుతం వరుసగా బిగ్ బాస్ తెలుగు సీజన్లను తన హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 కు రెడీ అవుతున్నాడు కూడా.