విలన్ గా నాగార్జున, తమిళ సూపర్ స్టార్ సినిమాలో మన్మథుడి విలనిజం.. ?

Published : Jul 24, 2024, 02:07 PM ISTUpdated : Jul 24, 2024, 02:30 PM IST

ఈమధ్య బాలీవుడ, కోలీవుడ్ స్టార్లు టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈసారి మన టాలీవుడ్ స్టార్ హీరో.. నాగార్జున తమిళంలో విలన్ గా కనిపించబోతున్నాడట. ఇందులో నిజమెంత.  

PREV
15
విలన్ గా నాగార్జున, తమిళ సూపర్ స్టార్ సినిమాలో  మన్మథుడి విలనిజం.. ?

బాలీవుడ్ సీనియర్ హీరోలు టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో విలన్స్ గా నటిస్తుండటం చూస్తూనే ఉన్నాం. తమిళం నుంచి కూడా స్టార్ హీరోలు తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించారు. ఇక ఈ మధ్య సునిల్,జగపతి బాబు కూడా తమిళంతో పాటు మలయాళ సినిమాల్లో విలన్లుగా నటిస్తున్నారు. కాగా ఇఫ్పుడు తెలుగు స్టార్ హీరోలు కూడా తమిళ విలన్లు గా మారుతున్నట్టు తెలుస్తోంది. 
 

 

25

తాజాగా వినిపిస్తున్న రూమర్ ప్రకారం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున విలన్ నటించబోతున్నారంటూ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. రజినీకాంత్ కు ధీటుగా... పవర్ ఫుల్ రోల్ లో ఆయన కనిపిస్తారని సమాచారం. సూపర పవర్ ఫుల్ పాత్రకు.. కింగ్ పవర్ ఫుల్ విలనిజం తోడైతే.. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
 

35
Rajinikanth

కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూలీ. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ తలైవ రజనీకాంత్‌కు 171వ సినిమాగా తెరకెక్కుతోంది.   సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఈ నెల‌లోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది.  ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 

45

అయితే ఈ సినిమాలోనే నాగార్జున విలన్ అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ వార్తలు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రజనీకి ఎదురుపడే పాత్రలో టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని నాగార్జున నటిస్తున్నారట.. దీనిపై మేకర్స్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 

55
Rajinikanth

అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న నాగార్జున విలన్‌గా నటించడం ఇదేమీ మొదటిసారి కాదు.  ఇంతకు ముందు ఓ బాలీవుడ్‌ మూవలో విలన్‌గా నటించి మెప్పించారు. ఈ సారి రజనీకాంత్‌ పక్కన విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

click me!

Recommended Stories