Bigg Boss Telugu 8: కంటెస్టెంట్‌గా మోస్ట్ కాంట్రవర్సియల్‌ హీరో? తీసుకోవడం వెనుక పెద్ద స్కెచ్‌?

Published : Jul 24, 2024, 12:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌కి సంబంధించిన ఓ సెన్సేషనల్‌ వార్త వైరల్‌ అవుతుంది. ఈసారి హౌజ్‌లోకి మోస్ట్ కాంట్రవర్షియల్‌ హీరోని తీసుకురాబోతున్నారట.   

PREV
16
Bigg Boss Telugu 8: కంటెస్టెంట్‌గా మోస్ట్ కాంట్రవర్సియల్‌ హీరో? తీసుకోవడం వెనుక పెద్ద స్కెచ్‌?
Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ కి సంబంధించిన హడావుడి నడుస్తుంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. చాలా మంది క్రేజీ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొందరు సీనియర్ల పేర్లు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లు రాబోతున్నారంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు ఫైనల్‌ అవుతారనేది మాత్రం షో స్టార్ట్ అయితేగానీ తెలియదు. 
 

26

ఇదిలా ఉంటే ఈ సారి ఓ మోస్ట్ కాంట్రవర్సియల్‌ హీరోని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. ఆ హీరోని బిగ్‌ బాస్‌ నిర్వహకులు కూడా అప్రోచ్‌ అయినట్టు తెలుస్తుంది. ఈ సారి ఏదైనా కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో బిగ్‌ బాస్‌ నిర్వహకులు చాలా మార్పులు చేస్తున్నారు. సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్లు, సర్‌ప్రైజింగ్‌ కంటెస్టెంట్లని తీసుకురాబోతున్నారు. అంతేకాదు హౌజ్‌లోనూ మార్పులు చేస్తున్నారట. మెయిన్‌ కోర్‌ కాన్సెప్ట్ కి డిస్టర్బ్ కాకుండా ట్విస్ట్ లు, టర్న్ లు జోడిస్తున్నారట. 
 

36

ఈ క్రమంలో ఓ కాంట్రవర్షియల్‌ హీరోని తీసుకురావాలని చూస్తున్నారట.  ఆ కాంట్రవర్సియల్‌ హీరో ఎవరో కాదు రాజ్‌ తరుణ్‌. ఇటీవల తన ప్రియురాలు లావణ్య విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటూ, ఆమెతో డేటింగ్‌ చేస్తూ తనని దూరం పెట్టాడని, తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని లావణ్య వాదిస్తుంది. పోలీస్‌ కేసు కూడా పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి గురించి ఒకరు రహస్యాలన్నీ బయటపెట్టుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే తమ బాగోతాలు బయటపెట్టుకున్నారు. వీరి కేసు ఇప్పుడు కోర్ట్ లో ఉంది.
 

46

ఈ నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకురావాలని నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఆయన్ని ఇప్పటికే కలిశారని, దీనిపై డిస్కషన్ కూడా జరిగిందని తెలుస్తుంది. ఓ వైపు వివాదాలు, మరోవైపు కేసులు, ఇంకోవైపు ఆయన సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని ఆయన వస్తాడా? అసలు రావడం కుదురుతుందా? కేసుల్లో, వివాదాల్లో ఉన్న వారిని తీసుకురావడం కరెక్టేనా అనేది సస్పెన్స్ గా మారింది. 
 

56
Raj Tarun and Lavanya

అయితే రాజ్‌ తరణ్‌ని బిగ్‌ బాస్‌కి తీసుకురావడం వెనుక బలమైన కారణం ఉంది. ఆయన వస్తే హౌజ్‌ మరింత హాట్‌ హాట్‌గా మారుతుంది. క్యూరియాసిటీ పెరుగుతుంది. హౌజ్‌లో కావాల్సినంత కంటెంట్‌ క్రియేట్‌ అవుతుంది. ఇది అంతిమంగా టీఆర్‌పీ రేటింగ్‌ పెరగడానికి కారణమవుతుంది. జనాలు ఎక్కువగా ఈ షోని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని భావించి బిగ్‌ బాస్‌ నిర్వహకులు ఆయన్ని కలిశారని తెలుస్తుంది. కానీ ఇది వినడానికి కూడా చాలా క్రేజీగా ఉంది. నాగ్‌, బిగ్‌ బాస్‌ నిర్వహకుల ప్లాన్‌ కూడా ఇదే అని టాక్‌.  మరి రాజ్‌ తరుణ్‌ నిజంగానే బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్తాడా? అది సాధ్యమవుతుందా? అనేది చూడాలి. 

66
Bigg boss telugu 8

ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిలో యాంకర్‌ వింధ్యా, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ బాయ్‌ ఫ్రెండ్‌ శివ, యాంకర్ నిఖిల్‌, బంచిక్‌ బబ్లూ, సుప్రీత, అమర్‌ దీప్‌ భార్య తేజూ, సీనియర్‌ హీరోయిన్‌ దీపికా, శ్వేతా నాయుడు, సీరియల్‌ నటుడు ఇంద్రనీల్‌, కమెడియన్‌ సద్దాం, యాదమ్మ రాజు, కుషితా కల్లాపు, రీతూచౌదరి, కిర్రాక్ ఆర్పీ, మై వీలేజ్‌ షో అనిల్‌, సాయికిరణ్‌, నటి సనా, శీతల్‌ గౌతమ్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు సీనియర్‌ నటుడు వినోద్ కుమార్‌, సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ఎంత మంది బిగ్‌ బాస్‌ షోకి వస్తారనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories