నాగార్జున - అమల పెళ్ళి.. 1992లో జరిగింది. అప్పటి నుంచి దాదాపు 32 ఏళ్లుగా ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. నాగార్జున హీరోగా ఎంతటి స్టార్ డమ్ సంపాదించుకున్నాడో అందరికి తెలిసిందే.. అటు నటి అమల కూడా 1986లో ప్రముఖ దర్శకుడు డి రాజేందర్ దర్శకత్వం వహించిన "మైథిలి మీని కడలి" చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.
జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?
ఇటు నాగార్జున కూడా తెలుగులో టైర్ 1 హీరోగా.. స్టార్ డమ్ ను సాధించాడు. ఈక్రమంలో వీరిద్దరు పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఇద్దరు తెలుగు సినిమాల్లో నటిస్తున్న టైమ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. అంతకుముందు నాగార్జున కు హీరో వెంకటేష్ చెల్లెలితో పెళ్ళి జరిగి నాగచైతన్య జన్మించాడు.
ఈక్రమంలో వారికి విడాకులు అవ్వగా.. అమలను ప్రేమించిన నాగార్జున 1992 జూన్ 11న వీరు పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓబాబు జన్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఉన్న అఖిల్ నాగార్జున అమల దంపతులు తనయుడు. అఖిల్ 1994 లో జన్మించాడు.,
నాగార్జున, నటి అమల ప్రేమ పెళ్లికి సంబంధించిన అరుదైన ఫోటో.
అమల 80 నుంచి 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సాధించింది బ్యూటీ. ప్రస్తుతం వీరి పెళ్లిఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా తమ 32వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు నాగార్జున అమల. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా.. వివాదాలకు దూరంగా ఉన్న జంటగా రికార్డ్ క్రియేట్ చేశారు. కాగా 60 ఏళ్ళు దాటినా యంగ్ లుక్ లో మెరిసిపోతున్నాడు కింగ్ నాగార్జున్. ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అటు అమల కూడా తనకు నచ్చిన కథ వచ్చినప్పుడు సినిమాలు చేస్తోంది. యంగ్ హీరోలు తల్లిగా కనిపిస్తోంది.