పెళ్లైన యాంకర్‌తో అన్ని పనులు జరిగిపోయాయా? అందరి ముందు సుడిగాలి సుధీర్‌ బండారం బట్టబయలు.. దెబ్బకి షాక్‌

Published : Jul 02, 2024, 08:37 AM IST

సుడిగాలి సుధీర్‌ అంటే ప్లేబాయ్‌ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆయన అలాంటి కామెంట్లతో అలరిస్తుంటారు. అయితే పెళ్లైన యాంకర్‌ మాత్రం ఆవేశంలో తమ మధ్య జరిగిందంతా బయటపెట్టింది.   

PREV
16
పెళ్లైన యాంకర్‌తో అన్ని పనులు జరిగిపోయాయా? అందరి ముందు సుడిగాలి సుధీర్‌ బండారం బట్టబయలు.. దెబ్బకి షాక్‌
pics-family stars promo

సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యారు. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఆయన కామెడీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేసి యూత్‌కి బాగా దగ్గరయ్యాడు సుధీర్‌. అంతేకాదు, ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. 

26
pics-family stars promo

సినిమా ఆఫర్లు రావడంతో `జబర్దస్త్`ని వదిలేశాడు సుడిగాలి సుధీర్‌. రెండు మూడు సినిమాలతో రచ్చ చేశాడు. కానీ ఆయన చేసే సినిమాలు స్ట్రక్‌ అయ్యాయి. దీంతో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయ `సర్కార్‌ 4`, `ఫ్యామిలీ స్టార్స్` కి యాంకర్‌గా చేస్తున్నాడు. `ఫ్యామిలీ స్టార్స్`లో ఇద్దరు లేడీ యాంకర్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు. 
 

36
pics-family stars promo

ఇందులో ఓ యాంకర్‌తో సుడిగాలి సుధీర్‌ బాగా పులిహోర కలుపుతున్నాడు. ఆమె కూడా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. బోల్డ్ గా మాట్లాడుతుంది. ఈ క్రమంలో ఓ రహస్యం లీక్‌ చేసింది. తమ మధ్య జరిగిన రహస్యాన్ని అందరి ముందు బయటపెట్టింది. తమ మధ్య అంతా అపోయింది కదా బావా అంటూ షాక్‌ ఇచ్చింది. దెబ్బకి సుధీర్‌తోపాటు అంతా నోరెళ్లబెట్టారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే..
 

46
pics-family stars promo

`ఫ్యామిలీ స్టార్స్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో సుధీర్‌ మెయిన్‌ యాంకర్‌ కాగా, ఆయనకు ఇద్దరు మరదళ్లుగా యాంకర్‌ స్రవంతి, భాను వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు సుధీర్‌ వెంటపడుతుంటారు. తనదైన ప్లేబాయ్‌ స్కిట్లతో రచ్చ చేస్తుంటాడు సుధీర్‌. ఆ ఇద్దరు సుధీర్‌తో, సుధీర్‌ వాళ్లతో పులిహోర కలుపుతూ అలరిస్తుంటారు. 
 

56
pics-family stars promo

అయితే భాను.. `నిన్ను ఇలానే వదిలేసే నన్ను వదిలేసా ఉన్నావ్‌గానీ, మా ఫ్యామిలీని పిలిపించి తాంబూలం పెట్టిస్తా, మనిద్దరం పెళ్లి చేసుకుందాం ని నిలదీస్తుంది. దీంతో పక్కనే ఉన్న పెళ్లైన యాంకర్‌ స్రవంతి రెచ్చిపోయింది. `మనకన్నీ జరిగిపోయాయి కదా బావా` అంటూ బాంబ్‌ పేల్చింది. ఆవేశంలో అసలు విషయం లీక్‌ చేసింది. దెబ్బకి సుధీర్‌, భానుతోపాటు అందరు షాక్‌ అయ్యారు. నోరెళ్లబెట్టారు.
 

66
pics-family stars promo

`ఫ్యామిలీ స్టార్స్` లేటెస్ట్ ప్రోమోలోని సీన్‌ ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో `శతమానం భవతి`, `కలిసుందాంరా` సీరియల్స్ నటులు పాల్గొని సందడి చేశారు. అలాగే `భలే ఉన్నాడే` సినిమా టీమ్‌, రాజ్‌ తరుణ్‌ పాల్గొని అలరించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా హీరోయిన్‌ కూడా ఇందులో సుధీర్‌తో పులిహోర కలపడం హైలైట్‌గా నిలిచింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories