మరో అమ్మాయితో `జబర్దస్త్` వర్షకి అడ్డంగా దొరికిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. రోజా ముందుకు పంచాయితీ.. వార్నింగ్‌

Published : Oct 13, 2021, 05:57 PM ISTUpdated : Oct 14, 2021, 08:57 AM IST

`జబర్దస్త్` వర్ష, ఇమ్మాన్యుయెల్‌ `జబర్దస్త్` షోలో ఎంతగా పాపులర్‌ అయ్యారో తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని, ఇమ్మాన్యుయెల్‌ లేకపోతే తన లైఫ్‌ని ఊహించుకోవడం కష్టమని చెప్పింది వర్ష. కానీ ఆ తర్వాత అది రివర్స్ అయ్యింది. తాజాగా వర్షకి షాకిచ్చాడు ఇమ్మాన్యుయెల్. మరో అమ్మాయితో వర్షకి అడ్డంగా దొరికిపోయాడు ఇమ్మూ.  

PREV
18
మరో అమ్మాయితో `జబర్దస్త్` వర్షకి అడ్డంగా దొరికిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. రోజా ముందుకు పంచాయితీ.. వార్నింగ్‌

అయితే ఇంతలో రాత్రి పదకొండు గంటలకు ఓ అమ్మాయి ఫోన్‌ చేసిందని, అంతకు ముందు తనని అంతా చాక్లెట్‌ బాయ్‌లా ఉండేవారని, ఆ అమ్మాయి వచ్చాక చాక్లెట్‌ మొత్తం కారిపోయిందంటూ తన ఆవేదన వెల్లడించారు. `కొంత మంది మన లైఫ్‌ లో లేకపోతే కష్టం మేడమ్‌ అంటూ అమాయకంగా చెప్పిందని, ఇప్పుడు తన జీవితం ఆగం చేసిందని వాపోయాడు ఇమ్మూ.

28

లవ్‌ ట్రాక్‌ స్కిట్లు, కెమిస్ట్రీ స్కిట్లకి దూరంగా ఉంటున్నారు jabardasth varsha, immanuel. వర్షని చాలా మంది తప్పుగా కామెంట్లు చేయడమే అందుకు కారణం కావచ్చు. ఇదే విషయంలో `జబర్దస్త్` వేదికగా పంచుకుని కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. ఆ తర్వాత నుంచి ఒకే టీమ్‌లో కంటిన్యూ అవడం లేదు. సపరేట్‌గా స్కిట్లు చేసుకుంటున్నారు. 

38

చాలా రోజుల తర్వాత ఇమ్మాన్యుయెల్‌, వర్ష కలిసి సందడి చేశారు. దసరా స్పెషల్‌లో భాగంగా `దసరా బుల్లోడు` స్పెషల్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు మల్లెమాల టీమ్‌. ఇందులో మరోసారి కలిసి సందడి చేసింది ఇమ్మూ, వర్ష జోడి. 

48

అందులో భాగంగా ఓ ఈవెంట్‌లో ఇమ్మాన్యుయెల్‌ మరో కొత్త అమ్మాయితో కనిపించాడు. వర్ష కంటే తెల్లగా, అందంగా ఉందీ ఆ అమ్మాయి. పైగా ఇద్దరూ ఒకే దగ్గర పక్క పక్కనే కూర్చున్నారు. ఇమ్మూ చేయిపట్టుకుని సిగ్గులు మొగ్గేస్తుంది ఆ అమ్మాయి. ఇది చూసిన వర్ష రెచ్చిపోయింది. 
 

58

మరో అమ్మాయితో ఇమ్మాన్యుయెల్‌ని చూసిన వర్ష కోపంతో రగిలిపోయింది. `ఏంటా అమ్మాయి షర్ట్ పట్టుకుంటుంది` అంటూ గ్యాప్‌ లేకుండా ఇమ్మూ చెంప చెల్లుమనిపించింది. అంతటితో ఆగలేదు వర్ష. వాళ్ల పంచాయితీని రోజా ముందుకి తీసుకొచ్చింది. రోజా వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యింది. 
 

68

చూశారా మేడమ్‌.. నేను పక్కన ఉండగా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడంటూ వాపోయింది వర్ష. కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి కౌంటర్‌ ఇచ్చాడు ఇమ్మూ.. నాకిష్టమైన వాళ్లతో నేనుంటా. అయితే ఏంటీ ఇప్పుడు అంటూ రోజాకి ఎదురెళ్లాడు. దీంతో ఇమ్మూ చెంప వాయించింది రోజా. నేను ఆ అమ్మాయిని ప్రేమించాంటూ వాదించాడు. వేలు చూపిస్తూ మరీ రెచ్చిపోయాడు ఇమ్మూ. 
 

78

దీనికి రోజా సైతం ఘాటుగా స్పందించింది. చేయి దించమని వార్నింగ్‌ ఇచ్చింది. చేయి దించకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో తనక్కూడా తెలియదంటూ హెచ్చరించింది. రోజా వార్నింగ్‌కి కూల్‌ అయిన ఇమ్మూ.. తమ మధ్యప్రేమని వెల్లడించారు. తామిద్దరం ఘాటు ప్రేమలో ఉండేవాళ్లమని తెలిపారు. 
 

88

ఆద్యంతం కామెడీగా సాగిన ఈ స్కిట్‌ మరోసారి ఆడియెన్స్‌ ని కడుపుబ్బ నవ్వించింది. వర్ష, ఇమ్మూ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. దసరాకి ఈ స్పెషల్‌ ఈవెంట్‌ ఉండబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories