గేమ్ మధ్యలోనే వదిలేసి వచ్చిన మణికంఠకు మాత్రం బయటకు రాగాను బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. మణికంఠ బయటకు రాగానే ఓ సీరియల్ లో హీరోగా చేసే అవకాశం వచ్చిందట. భారీ స్థాయిలో తెరకెక్కబోతున్న ఆ సీరియల్ లో మణికంఠను హీరోగా తీసుకోబోతున్నాట. దాంతో పాటు మా పరివార్ నుంచి కూడా మణికి ఆహ్వానం అందిందట.
దీంతో పాటు కొన్ని సినిమా ఆఫర్లు కూడా ఆయనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మాటీవీ షోస్ లో కూడా ఆయన కనిపించబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ లో చివరి వరకూ ఉంటేు మణికంఠ టాప్ 5 లొ పక్కా ఉండేవాడు. కాని బయటకు వచ్చినా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదు. చూడాలి మరి నాగమణికంఠ కెరీర్ ఎక్కడివరకూ వెళ్తుందో.