ఎన్టీఆర్‌పై మెగా బ్రదర్‌ నాగబాబు సెన్సేషనల్‌ కామెంట్‌..పండగ చేసుకుంటున్న నందమూరి ఫ్యాన్స్

Published : Mar 17, 2021, 10:32 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు..యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఈ రెండు ఫ్యామిలీల మధ్య  కాస్త గ్యాప్‌ కొనసాగుతున్న నేపథ్యంలో బారియర్స్ ని బ్రేక్‌ చేసి నాగబాబు.. ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి నాగబాబు వ్యాఖ్యలకు, నందమూరి ఫ్యాన్స్ ఎందుకు ఖుషీ అవుతున్నారనేది చూస్తే..   

PREV
19
ఎన్టీఆర్‌పై మెగా బ్రదర్‌ నాగబాబు సెన్సేషనల్‌ కామెంట్‌..పండగ చేసుకుంటున్న నందమూరి ఫ్యాన్స్
ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన సినిమాలతోపాటు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. జెమినీ టీవీలో ఇది త్వరలో ప్రసారం కానుంది.ఇటీవల విడుదలైన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

29
ఈ సందర్భంగా మీడియా కాన్ఫరెన్స్ లో ఎన్టీఆర్‌ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజకీయ ఎంట్రీపై కూడా ఆయన మాట్లాడారు. దాని గురించి మాట్లాడే సమయం, సందర్భంగా కాదని, తర్వాత ఓ రోజు తీరిగ్గా వేడి వేడి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్‌ రాజకీయ ఎంట్రీపై నెలకొన్న సస్పెన్స్ ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

39
ఇదిలా ఉంటే మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవల రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏపీలో వైఎస్‌జగన్‌, టీడీపీ వాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. నచ్చితే ప్రశంసించడం,నచ్చకపోతే విమర్శించడం ఆయన స్టయిల్‌. ఏపీ ప్రభుత్వ తీరుపై, వైసీపీ నాయకులపై ఆయన దుమ్మెత్తిపోస్తుంటారు.

49
మరోవైపు నాగబాబు టీవీ హోస్ట్ గా, జడ్జ్ గా బిజీగానే ఉంటున్నారు. మొన్నటి వరకు ఆయన `జబర్దస్త్` షోలకు జడ్జ్ గా ఉండి ఆకట్టుకున్నారు. రోజాతో కలిసి ఆయన మెప్పించారు. వీరి కాంబినేషన్‌కి మంచి పేరుంది.

59
కానీ వేరే ఛానెల్‌ నుంచి ఆఫర్‌ రావడంతో జబర్దస్త్ ని వదిలేశారు. `అదిరింది` లాంటి షోలు చేశారు. ఇప్పుడు ఆ షోస్‌ కూడా లేవు. సొంతంగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో స్టాండప్‌ కామెడీ షోని నిర్వహిస్తున్నాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాగబాబు చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాడు.

69
దీంతో రాజకీయాలపై ఫోకస్‌ పెట్టాడు. తరచూ రాజకీయాలపై ఆయనస్పందిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నాడు. అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నాగబాబు అభిమానులతో ఛాట్‌ చేశాడు.

79
ఈ ఛాటింగ్‌లో ఓ అభిమాని ఎన్టీఆర్‌ నటించిన `అరవింద సమేత` చిత్రంలోని వారి పాత్రలను ప్రస్తావిస్తూ, `వీరరాఘవ గురించి చెప్పు నారప్ప రెడ్డి` అని అన్నారు. దీనికి నాగబాబుస్పందిస్తూ, ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన `నేటి తరం టార్చ్ బేరర్‌` అని ప్రశంసించాడు. ఎన్టీఆర్‌పై ఈ రేంజ్‌లో ప్రశంసలు కురిపించడంతో నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. నాగబాబుకి థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్‌లో ఆ సినిమాలోనే ఉన్న విషయం తెలిసిందే.

89
మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్‌లో రెండు పెద్ద ఫ్యామిలీలు. ఒకరికొకరు దీటుగా సినిమాలు చేస్తుంటారు. వీరి సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటాపోటీగా విడుదలవుతుంటాయి. ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య కొంత గ్యాప్‌ అయితే కనిపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టి నాగబాబు ఇలా మాట్లాడటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. `అరవిందసమేత`లో నాగబాబు, ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.

99
ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కొమురంభీమ్‌గా నటిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories