యూపీ భామ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలైన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ ని ఆమె వివాహం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ లో లావణ్య-వరుణ్ తేజ్ ఏడడుగులు వేశారు. ఇటలీ దేశంలో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా హీరోలందరూ హాజరయ్యారు.
మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్-లావణ్య జంటగా నటించారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం.
పెళ్లయ్యాక లావణ్య నటనకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. అయితే వరుణ్ తేజ్ మద్దతు ఇవ్వడంతో తనకు ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ ని లావణ్య కొనసాగిస్తుంది. తాజాగా మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది.
Varun Tej
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించాడు. లావణ్య హీరోయిన్. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కి నాగబాబు తన షార్ట్ రివ్యూ ఇచ్చారు. కోడలిని పొగడ్తలతో ముంచెత్తారు.
Lavanya Tripathi
మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేసింది. అందరి చూడాల్సిన వెబ్ సిరీస్ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. నాగబాబు పరోక్షంగా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ని ప్రమోట్ చేశాడు.
Lavanya Tripathi
కాగా లావణ్య ఓ తెలుగు సినిమాకు కూడా సైన్ చేశారని సమాచారం. అర్థం చేసుకునే అత్తామామ, భర్త దొరకడంతో లావణ్య ఇష్టమైన నటనకు దూరం కాకుండా కొనసాగుతోంది.