మహేష్‌ సినిమాకి టెక్నీషియన్ల లిస్ట్ ఇదే.. ఆ ఒక్కరి విషయంలో రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా ?

First Published | Feb 13, 2024, 1:12 PM IST

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అయితే ఈ సారి తన టెక్నీకల్ టీమ్‌ మొత్తాన్ని మార్చేశాడు జక్కన్న. 
 

Mahesh,rajamouli

మహేష్‌ బాబుతో సినిమా చేయాలనేది దాదాపు 14ఏళ్ల కమిట్‌మెంట్‌. `ఈగ`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`తో అది డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు సెట్‌ అయ్యింది. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో గ్లోబల్‌ మార్కెట్ గా తెరకెక్కిస్తున్నారు. ఆ దిశగానే ఆయన ప్లానింగ్‌ జరుగుతుంది. 

SS Rajamouli

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్‌రెడీ పూర్తయ్యిందట. ఫైనల్‌ టచ్‌ జరుగుతుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం మహేష్‌ బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు. లుక్‌ మొత్తం మార్చేస్తున్నాడు. మరోవైపు తన టీమ్‌ని ఫైనల్‌ చేస్తున్నాడు రాజమౌళి. టెక్నీకల్‌ టీమ్‌ ఫైనల్‌ అయ్యిందట. అయితే గత చిత్రాలకు పనిచేసిన వారిని మొత్తం మార్చేశాడు జక్కన్న. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 


రాజమౌళి గత చిత్రాలు `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కీరవాణి చేశాడు. ఆయన ప్రతి సినిమాకి ఉండాల్సిందే. ఇక సినిమాటోగ్రాఫర్‌గా కెకె సెంథిల్‌ కుమార్‌, ఎడిటర్‌గా శ్రీకర్‌ ప్రసాద్‌, కోటగిరి వెంకటేశ్వరరావులు పనిచేశారు. వీఎఫ్‌ఎక్స్ శ్రీనివాస మోహన్‌ టీమ్‌ చేసింది. ప్రొడక్షన్‌ డిజైనర్‌(ఆర్ట్) గా సబు సిరిల్‌ టీమ్‌ చేసింది. 
 

ఇప్పుడు మహేష్‌బాబు సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి తప్ప మిగిలిన వాళ్లంతా మారిపోయింది. సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌ని తీసుకున్నారు. అలాగే ఎడిటర్‌గా తమ్మిరాజుని ఎంపిక చేశారు. మరోవైపు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కమల్‌ కన్నన్‌ టీమ్‌కి అప్పగించారు. ఈ మూవీని ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో రూపొందిస్తుండటంతో ఆ స్థాయి స్టాండర్డ్స్ మెయింటేన్‌ చేసే టెక్నీషియన్లకి ఆయా బాధ్యతలు అప్పగించారు రాజమౌళి. ఈ రకంగా తన వర్క్ సులభం అయ్యేలా చేస్తున్నాడు. 
 

ఇదిలా ఉంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మాత్రం కీరవాణిని మార్చడం లేదు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో కీరవాణి ఆస్కార్‌ అందుకున్నారు. `నాటునాటు` పాట అంతర్జాతీయంగా పాపులర్‌ అయ్యింది. దీంతో ఆయన్ని మార్చే డేర్‌ చేయడం లేదు. పైగా ఆయన్ని మార్చితే అది పెద్ద సంచలనం కానుంది. ఎందుకంటే ప్రారంభం నుంచి తన అన్ని సినిమాలకు అన్న కీరవాణినే మ్యూజిక్‌ చేస్తున్నారు. తమ ఆలోచనలను అంతే బాగా పంచుకుంటున్నారు. ఆలోచనలను అర్థం చేసుకుంటారు. అలా ఈ బాండింగ్‌ని ఎప్పటికీ కొనసాగుతుందని తాజా పరిణామాలతో స్పష్టమవుతుంది. 

Rajamouli

అయితే ఈ విషయంలోనే కొంత రిస్క్ చేస్తున్నారా? అనే సందేహాలు, కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కీరవాణి స్థానికి మ్యూజిక్‌ అందించడంలో తోపు. ఆయన్ని కొట్టేవాళ్లు లేరు. కానీ మహేష్‌బాబు సినిమా గ్లోబల్‌ రేంజ్‌లో ఉంటుంది, అంటే విదేశీ ఆడియెన్స్ ని కూడా మెప్పించాలి. మ్యూజిక్‌లో వెస్ట్రన్‌ టచ్‌ కూడా ఉండాలి. మరి కీరవాణి అలా చేస్తాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌` సమయంలోనే కొంత విమర్శలు కూడా వచ్చాయి. కానీ అది ఇండియన్‌ మూవీ మాత్రమేకావడంతో నడిచిపోయింది. 

ఇప్పుడు ఇంటర్నేషన్‌ మూవీ కావడంతో కీరవాణితో అది సాహసమే అనే కామెంట్స్ వస్తున్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ని మార్చడమా? లేక కొన్ని పాటలను ఇతర డైరెక్టర్లతో చేయించడమో చేయాలని అంటున్నారు. కానీ రాజమౌళి ఫైనల్‌ చేశాడంటే అందులో తిరుగు ఉండదు. అన్న అయినా సరే నచ్చిన మ్యూజిక్‌ని రాబట్టుకోవడంలో ఆయన రాజీ పడరని చెప్పొచ్చు. మరి అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తో చూడాలి. 

Latest Videos

click me!