చాలా తక్కువ టైమ్ లో హీరోయిన్ గా తనను తాను నిరూపించుకుంది శ్రీలీల. వరుస సినిమాలతో టాలీవుడ్ ను శేక్ చేస్తోంద బ్యూటీ. తన భర్త ఎలా ఉండాలో తాజాగా ఓఇంటర్వ్యూలో వెల్లడించింది.
రీసెంట్ గా మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన శ్రీలీల.. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికిఅన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాని ఆమెకు ఈమధ్య ఫెయిల్యూర్స్ బాధ ఎక్కువైపోయింది. నితిన్,రామ్,వైష్ణవ్ తేజ్ తో చేసిన సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో.. ఆమె కాస్త ఆలోచనలో పడింది.

తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ‘ఒరిజినల్’ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది. ఇంటర్వ్యూలో క్యూట్, ఫన్నీ ప్రశ్నలు అడిగారు. ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రోమో అంతా ఫుల్ ఫన్నీగా సాగింది.
ఇందులో సౌమ్య.. మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, ఫన్నీ, జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని అడిగితే శ్రీలీల.. ఫన్నీ, జోవియల్ అబ్బాయే కావాలి, బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటాను అని చెప్పింది.
ఇక ఇండైరెక్ట్ గా బ్రెయిన్ లేని అబ్బాయి అయిన పర్లేదు, నవ్వించే అబ్బాయి కావాలంటుంది. ఇలాంటి బోలెడన్ని సరదా ప్రశ్నలు ఈ ఇంటర్వ్యూలో అడిగినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు.