నిహారిక కొణిదెల అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా భర్త వెంకట చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా ఇటీవల స్పష్టత వచ్చింది. నిహారిక, వెంకట చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. వెంకట చైతన్య, నిహారిక విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.