#.Jailer: ఫస్టాఫ్, క్లైమాక్స్ కే 'జై'లర్ (’రివ్యూ)

Published : Aug 10, 2023, 01:21 PM ISTUpdated : Aug 10, 2023, 01:22 PM IST

తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాతోనైనా రజనీ మళ్ళీ కమర్షియల్ హిట్ కొట్టగలిగారా?

PREV
110
#.Jailer: ఫస్టాఫ్, క్లైమాక్స్ కే   'జై'లర్ (’రివ్యూ)
Jailer movie review

‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతానే ఉండాలి.. అర్ధమైందా రాజా!!’ అన్న రజనీ వాయిస్ ఇప్పుడు తమిళ, తెలుగు జనాల చెవుల్లో మారుమ్రోగుతోంది. జైలర్ ఆడియో ఈవెంట్‌లో పవర్ పంచ్‌లు వేసి ‘జైలర్’ చిత్రానికి ఓ రేంజి హైప్ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్.  ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమన్నా ‘నువు కావాలయ్యా.. నువు కావాలయ్యా’ పాట బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. 

210
Rajinikanth Jailer


ఎన్ని ఫ్లాఫ్ లు రానీ ...రజనీకాంత్ కొత్త సినిమా అంటే ఫ్యాన్స్ కు వచ్చే ఉత్సాహం,ఊపే వేరు. అలాంటిది ట్రైలర్ క్లిక్ అయ్యిందంటే ఇంక ఏ ప్రమోషన్ అక్కర్లేదు..జనాలు థియేటర్స్ దగ్గర క్యూలు కట్టేసారు. ఈ సారి అదే జరుగుతోంది. అయితే ఎంతో ఉత్సాహంతో థియేటర్ లోకి వెళ్లే సగటు అభిమానికి కావాల్సింది మాత్రం దొరకటం లేదు. దాంతో నిట్టూరుస్తూ బయిటకు వచ్చేస్తున్నాడు. ఈ సారి అయినా రజనీ సగటు ప్రేక్షకుడుకు ఆనందం కలిగించాడా..అసలు చిత్రం కథేంటి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కు సినిమాలో క్యారక్టర్స్ ఏమిటి వంటి విషయాలు చూద్దాం..

310


  
రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ (Rajinikanth)చాలా సైలెంట్ గోయిర్. ఎక్కడా ఏ వివాదంలోనూ తల దూర్చడు. గొడవ అంటే ప్రక్కకు వెళ్లిపోయే మనిషి. తన  భార్య, కొడుకు, మనవడితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. కొడుకు ఓ నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్‌ కావటంతో మురిసిపోతూంటాడు. అయితే పురాతన దేవాలయాల్లో విగ్రహాలము మాయమవుతావుతూంటాయి. వాటిని దొంగతనం చేసి అమ్మేసుకునే స్మగ్నింగ్ ముఠాను పట్టుకోవాలని ఆ కొడుకు ప్రయత్నిస్తూంటాడు. అయితే అనుకోకుండా.. ముత్తు కొడుకు అర్జున్‌ మిస్సైపోతాడు. దాంతో ముత్తు రంగంలోకి దిగుతాడు. అతను కోసం వెతకుతూంటే.... స్మగ్లర్స్ చంపేశారనే వార్త బయటకు వస్తుంది. అప్పుడు ఈ రిటైర్డ్ జైలర్ లోంచి మరో మనిషి బయిటకు వస్తాడు. తన కొడుకుని చంపినవాళ్లపై యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో అతనికో ఊహించని నిజం తెలుస్తుంది.  అదేమిటి...ముత్తు  ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నదే మిగిలిన జైలర్ (Jailer Movie) కథ.

410

విశ్లేషణ

రజనీకాంత్ సినిమా అంటే ఖచ్చితంగా కొన్ని లెక్కలు ఉంటాయి. అలాగని ఆ లెక్కలు ప్రకారమే సినిమా తీసుకుంటూ వెళ్తే మూస మాస్ సినిమాలు వచ్చి డిజాస్టర్స్ అవుతున్నాయి. అవన్ని దర్శకుడు నెల్సన్ గమనించుకున్నాడు.  “నోబడీ” (2021) అనే హాలీవుడ్ సినిమా నుంచి స్టోరీ లైన్ ని తీసుకుని ...తను గతంలో తీసిన కోక్కోకిల(నయనతార), వరుణ్ డాక్టర్ (శివకార్తికేయన్) తరహాలోనే ఈ సినిమాలోనూ సింగిల్ ఎజెండాతో స్క్రిప్టు రాసుకున్నాడు. యోగిబాబుతో కామిడీని ప్లాన్ చేసుకున్నాడు. అలాగే సెకండాఫ్ లో కామెడీ కోసం సునీల్ ని తెచ్చుకున్నాడు. ఇతర భాషల మార్కెట్ కోసం శివరాజ్ కుమార్ ని, మోహన్ లాల్ ని తీసుకొచ్చి కథలో ఇమిడ్చాడు. అంతా బాగానే ఉంది. అయితే స్క్రిప్టు మాత్రం ఫెరఫెక్ట్ రాయలేకపోయారు. ఫస్టాఫ్ సినిమా పరుగెట్టింది. ప్రీ ఇంట్రవెల్, ఇంట్రవెల్ అయితే సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేసింది. అయితే వాటికి తగ్గట్లు సెకండాఫ్ లేదు. 

510

అప్పటిదాకా రివేంజ్ కథగా నడిచిన ఈ చిత్రం సెకండాఫ్ ప్రారంభంలో రజనీ ప్లాష్ బ్యాక్ ని రివీల్ చేసి, ఆ తర్వాత సునీల్ ని అడ్డం పెట్టి Heist జానర్ లోకి వెళ్లిపోయింది.క్లైమాక్స్ కు వచ్చేసరికి ఓ థ్రిల్లింగ్  ట్విస్ట్ ఇచ్చి ముగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ పెట్టుకోవటంతో సెకండాఫ్ లో కథ అందుకు తగినట్లు లేకుండా ఇష్టమొచ్చి వెళ్లిపోయింది. ఓ రకంగా అసలేమీ జరగలేదనే చెప్పాలి. ఏదో అనిరిధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజనీ బిల్డప్ లతో నడిచిపోతూంటూంటుంది. సినిమా ఇంక పోయిందేమో ..ఫస్టాఫ్ ఇంత బాగుంది..సెకండాఫ్ ఇలా చేసాడేంటి అనుకునేలోగా సర్దుకుని ట్విస్ట్ తో ప్రీ క్లైమాక్స్ సెట్ చేసి సెంటిమెంట్ తో క్లైమాక్స్ ఇచ్చి మన చేత ఓకే అనిపించి బయిటకు పంపేస్తాడు. అదే సెకండాఫ్ ..కూడా ఫస్టాఫ్ లాగ పరుగెత్తితే మరో నరసింహా అయ్యేదనటంలో సందేహం లేదు. అయితే ఈ సినిమా బాగుందనిపిచ్చేమో కానీ నిజంగా అంతా బాగోలేదు అన్నది మాత్రం నిజం.

610

ఈ సినిమాలో రజనీతో సమానంగా గుర్తు పెట్టుకునేది సంగీత దర్శకుడు అనిరిథ్ అని చెప్పాలి. చాలా సీన్స్ లో చెప్పుకోదగ్గ విషయం లేకపోయినా ఏదో ఉన్నట్లు మనకు ఫీల్ కలగచేస్తూ ముందుకు తీసుకువెళ్తూంటాడు.  ఆ తర్వాత చెప్పుకోదగ్గ టెక్నీషియన్ ..విజయ్ కార్తీక్ కణ్ణన్ . ఆయన సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగా ప్లస్సైంది. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి.. ప్రొడక్షన్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే అక్కడక్కడా విఎఫ్ ఎక్స్ షాట్స్, డి.ఐ వర్క్ మంచి  ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. దర్శకుడుగా నెల్సన్ ..సెకండాఫ్ పై దృష్టి పెట్టి ఉంటే నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిపోయేవాడే. 

710
Photo Courtesy: Instagram


రజనీకాంత్ తప్పించి ఈ హీరోయిజం ఎవరు చూసినా కామెడీగా వెటకారంగా ఉంటుంది. అయితే రజనీ మేనరిజమ్స్ ని ఆయన్ను ఎలా చూపించాలనే విషయమై డైరక్టర్ కొంచెం రీసెర్చ్ చేసి మరీ తీసినట్లున్నారు. ఇక రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనేటంత సీన్స్ లేవు. యోగిబాబు, విటి గణేష్ కామెడీ అదుర్స్. సునీల్ మాత్రం బాగా నిరాశపరుస్తాడు. తమన్నా సింగిల్ సాంగ్ కే పరిమితం. శివరాజ్ కుమార్, మోహన్ లాల్,  జాకీష్రాఫ్‌ వీళ్లింతా గెస్ట్ రోల్స్ కే పరిమితం కానీ పరవర్ ఫుల్.వీళ్ల సీన్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. విలన్ పాత్ర మాత్రం తమిల ప్లేవర్ తో నింపేసారు.

810


ముమ్మాటికీ రజనీ మోనరిజమ్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఇంట్రవెల్ సీన్స్
క్లైమాక్స్ ట్విస్ట్

సునీల్ ట్రాక్
సెకండాఫ్ లో ఫోర్స్ గా పెట్టిన  చాలా సీన్స్

910


ఇదే దర్శకుడు గత చిత్రం 'బీస్ట్' కన్నా  చాలా బెస్ట్.అలాగని వరుణ్ డాక్టర్ సినిమా అంత గొప్పకాదు..కానీ రజనీ ఉండటంతో ఈ లెక్కలు,కొలతలు ఏమీ పనికిరావు.

-----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75

1010


నటీనటులు : రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా భాటియా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు తదితరులు
ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్ 
సంగీతం : అనిరుధ్ 
సమర్పణ : కళానిధి మారన్  
నిర్మాణం : సన్ పిక్చర్స్
రచన, దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
వ్యవధి:2 Hrs 49 Min
విడుదల తేదీ: ఆగస్టు 10, 2023

click me!

Recommended Stories