చాలా రోజుల తర్వాత సుధీర్ ని కలిసిన రష్మీ.. ప్రియుడికి రొమాంటిక్ హగ్ ఇచ్చిన యాంకర్, నువ్వు నా గుండెల్లోనే..

Published : Aug 10, 2023, 12:18 PM IST

చాలా రోజుల తర్వాత సుధీర్, రష్మీ కలిశారు. ఒకే వేదికపై సందడి చేశారు. ఒక ప్రత్యేక ఈవెంట్ లో సుధీర్, రష్మీ పాత రోజులని గుర్తు చేసే విధంగా ప్రేమ పాఠాలు వల్లించారు.

PREV
16
చాలా రోజుల తర్వాత సుధీర్ ని కలిసిన రష్మీ.. ప్రియుడికి రొమాంటిక్ హగ్ ఇచ్చిన యాంకర్, నువ్వు నా గుండెల్లోనే..

జబర్దస్త్ షోతో బుల్లితెరపై సుధీర్ తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తింగరోడిగా కనిపిస్తూనే కామెడీ పంచ్ లతో సుధీర్ కడుపుబ్బా నవ్వించడం చూశాం. ఇక సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   అయితే ఇతర ఛానల్స్ లో అవకాశాలు రావడం, హీరోగా కూడా బిజీ అవుతుండడంతో ఆ మధ్యన సుధీర్ జబర్దస్త్ ని వదిలేశాడు. 

26

  గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ లాంటి చిత్రాలతో హీరోగా మారాడు. రష్మీతో కెమిస్ట్రీ సుధీర్ కి బాగా అడ్వాంటేజ్ అయింది. మంచి ప్రచారం కల్పించేలా చేసింది. సుధీర్, రష్మీ మధ్య నిజంగా కెమిస్ట్రీ ఉందో లేదో అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రం వీరిద్దరో లవ్ బర్డ్స్ లాగే బిహేవ్ చేశారు.   

36

సుధీర్ వేరే ఛానల్స్ కి వెళ్లిపోవడంతో.. రష్మీ, సుధీర్ కెమిస్ట్రీని ఆడియన్స్ మిస్ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత సుధీర్, రష్మీ కలిశారు. ఒకే వేదికపై సందడి చేశారు. ఒక ప్రత్యేక ఈవెంట్ లో సుధీర్, రష్మీ పాతరోజులని గుర్తు చేసే విధంగా ప్రేమ పాఠాలు వల్లించారు. సుధీర్ కి రష్మీ రొమాంటిక్ హగ్ ఇచ్చింది. అతడి గుండెలపై ప్రేమగా వాలిపోయింది. 

46

వీరిద్దరి మధ్య జరిగిన ప్రేమ సంభాషణలు వైరల్ గా మారాయి. మేడం గారు ఎందుకో కోపంగా ఉన్నట్లు ఉన్నారు అని సుధీర్ అడుగుతాడు. మరి నువ్వొస్తావని ఇన్నాళ్లు ఎదురుచూశాను.. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అడగగా.. నేను ఎక్కడ ఉన్నా నువ్వు నా గుండెల్లోనే ఉంటావు అని చెప్పడం వైరల్ గా మారుతోంది. 

56

సుధీర్ చెప్పిన ఆ సమాధానం విని రష్మీ సిగ్గుపడిపోయింది.వీళ్లిద్దరి మధ్యన జరిగిన సంభాషణ రొమాంటిక్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈటివి 28 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన ఈవెంట్ లో రష్మీ, సుధీర్ ఇలా పాల్గొన్నారు. 

66

అయితే సుధీర్, రష్మీ షోలో భాగంగానే ఇలా ప్రేమగా నటిస్తున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. సుధీర్ లేకపోయినా.. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వారు రష్మీపై అతడి గురించి సెటైర్లు వేస్తూనే ఉన్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories