‘గేమ్‌ ఛేంజర్‌’ హిట్ కాకూడదని నేను అన్నానా? : నాగవంశీ

First Published | Oct 21, 2024, 4:42 PM IST

నిర్మాత నాగ వంశీ తన సంక్రాంతి సినిమాకి పోటీ లేదని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వంటి పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల కానుండగా, నాగ వంశీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తర్వాత ఆయన తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

Naga Vamsi, Game Changer, ramcharanm, balakrishna

 ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మీడియాలో హాట్ టాపిక్ గా మారారు . ఈ క్రమంలో ఆయన కొన్ని వెబ్‌సైట్లకు  ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఆయన కావాలనే అంటున్నారా? లేక సందర్భానుసారం వస్తున్నాయో కానీ కొన్ని విషయాలు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అలాంటి వాటిలో సంక్రాంతి సినిమాల విషయం ఒకటి. వచ్చే ఏడాది తమ సినిమాకు పోటీనే ఉండదు అని ఆయన ఇటీవల అనడమే కారణం.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


నందమూరి బాలకృష్ణ – బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదట డిసెంబరులో రిలీజ్‌ చేస్తారని వార్తలొచ్చినా.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సంక్రాంతి సీజనే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు అని అర్థమవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సీజన్‌ పరిస్థితి ఏంటి అని నాగ వంశీ దగ్గర ప్రస్తావిస్తే..  ‘నాకు తెలిసి సంక్రాంతికి మాకు పెద్ద పోటీ ఉండ‌క‌పోవొచ్చు’ అని అన్నారు. 



ఈ క్రమంలో  సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలపై ఇటీవల నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఐదారు సినిమాలు బరిలో ఉన్నాయి. అందులో రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు – శంకర్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఉంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్‌ – అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ లాంటి పెద్ద సినిమా కూడా ఉంది.

అయినా నాగవంశీ ‘మాకు పోటీ లేదు’ అని అనడంతో ఎందుకన్నారో అని అనుకుంటున్నారు సినిమా జనాలు. చరణ్‌ ఫ్యాన్స్‌ అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను అంత లైట్‌ తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.


ఈ క్రమంలో ‘సంక్రాంతికి పోటీ ఉండదు’ అని చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్స్‌ను కొందరు తప్పుదోవ పట్టించారని అసహనం వ్యక్తం చేశారు.

‘‘సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తాయి కదా.. పోటీ ఎక్కువగా ఉంటుందా..? అని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఈసారి అన్ని సినిమాలు రావు. వచ్చినా.. పెద్దగా కాంపిటీషన్ ఉండదు అన్నాను. ఆ కామెంట్‌ను సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతికి వస్తుందని.. ఆ సినిమా మాకు పోటీ కాదని చెప్పినట్లు క్రియేట్‌ చేశారు.

ఇందులో ఏమైనా అర్థముందా?. ఈసారి సంక్రాంతికి ఆరు సినిమాలు రావు.. మూడు వస్తాయి. ఇలా విడుదలవడం ఇండస్ట్రీలో సహజమే. నేను ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ను సోషల్‌ మీడియాలో వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్‌గా నేను (Naga Vamsi) మరొకరి సినిమా హిట్‌ కాకూడదని ఎందుకు కోరుకుంటాను?. తర్వాత నేను కూడా ఆ హీరోతో పనిచేయాల్సి వస్తుంది కదా.. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు’’ అని అసహనం వ్యక్తం చేశారు.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఇటీవల ఇందులోని ‘రా మచ్చా.. ’ పాటను విడుదల చేశారు. తాజాగా ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సృష్టించడమే కాకుండా.. గ్లోబల్‌స్థాయిలో మెరుస్తోంది.

దక్షిణా కొరియా సింగర్‌, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ పార్క్‌ మిన్‌ తన బృందంతో కలిసి ఈ పాటకు స్టెపులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా ‘విడుదలకు ముందే ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది’ అని కామెంట్‌ చేస్తున్నారు. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

‘గేమ్ ఛేంజర్‌’ విషయానికొస్తే.. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి దీని టీజర్‌ వచ్చే అవకాశం ఉంది. 

read more: Pushpa-2 లో ప్రభాస్ హీరోయిన్ స్పెషల్ సాంగ్

Latest Videos

click me!