Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !

Published : Jun 26, 2026, 03:07 PM IST

Naga Durga Unguram Folk Song : డీజేలో దమ్మురేపుతోంది నాగదుర్గ ఉంగరం ఫోక్ సాంగ్. నాలుగేళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తూ 89 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న తెలంగాణ జానపద గీతం వివరాలు, లిరిక్స్ మీకోసం.

PREV
16
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. 89 మిలియన్ల వ్యూస్‌తో మామిడి మౌనిక, నాగదుర్గ రచ్చ

ప్రస్తుతం యూట్యూబ్‌లో తెలంగాణ పల్లె పాటలు నెక్స్ట్ లెవెల్‌లో రచ్చ లేపుతున్నాయి. అచ్చమైన జానపదాల మట్టి వాసనకు, ఆ బాణీలకు యావత్ దేశమే ఫిదా అవుతోంది. ఈ క్రమంలోనే ఒక సూపర్ హిట్ ఫోక్ సాంగ్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా సోషల్ మీడియాను రూల్ చేస్తోంది. ఎన్ని కొత్త పాటలు వచ్చినా దీని క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. అదే.. మనందరినీ లూప్‌లో వినేలా చేసిన నాగదుర్గ, మామిడి మౌనికల సాంగ్ ‘ఉంగూరమే’.

26
మౌనిక వాయిస్.. నాగదుర్గ మాస్ స్టెప్పులు

ఈ పాట ఇంత పెద్ద సంచలనం సృష్టించడానికి మెయిన్ రీజన్.. సింగర్ మామిడి మౌనిక అద్భుతమైన గాత్రం, నాగదుర్గ మాస్ స్టెప్పులు. తనదైన స్వచ్ఛమైన తెలంగాణ యాసతో ఆమె పాడిన విధానం ఈ పాటకు ప్రాణం పోసింది. జానపద మాస్ ఎనర్జీతో పాటు, వినసొంపైన మెలోడీ ఉండటంతో ఈ పాట అందరికీ కనెక్ట్ అయిపోయింది.

ఇక ఈ సాంగ్‌లో ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ తన ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులు, బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రచ్చ లేపింది. నాగదుర్గ వేసిన డ్యాన్స్ మూవ్స్ యూత్‌కు, జెన్జీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేశాయి. తస్లీమా, రమ్య, రష్మిత, జ్యోష్న, సుస్మిత, స్వప్న లాంటి డ్యాన్సర్లు కూడా తమ పర్ఫార్మెన్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చారు.

36
89 మిలియన్ల వ్యూస్.. డీజేలలో పూనకాలే

2021లో విడుదలైన ఈ ‘ఉంగరమే’ పాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో 89 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. పల్లెటూరి అందాలు, చెరువు గట్లు, పచ్చని పొలాల మధ్య సాగే ఈ పాట విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ డీజేలలో ఈ పాట ప్లే అవ్వాల్సిందే. దుర్గవ్వ అందించిన ఈ మూల కథకు, సింగర్స్ మామిడి మౌనిక, దుర్గవ్వల వాయిస్ తోడుకావడం విశేషం.

46
టెక్నికల్ టీమ్ సాలిడ్ వర్క్

ఈ సాంగ్‌కు ఎస్.వి. మల్లిక్ తేజ లిరిక్స్ అందిస్తూ, ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్షన్ వహించారు. జి.ఎల్. నామ్‌దేవ్ మ్యూజిక్, మహేష్ ఎంఎన్ డిజె మిక్సింగ్ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. శివ వేల్పుల సినిమాటోగ్రఫీ పల్లెటూరి లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించగా.. జలంధర్ బుధారపు, అంతడుపుల నాగరాజుల ఎడిటింగ్ వర్క్ విజువల్స్ ను రిచ్‌గా మార్చాయి.

నాగరాజు కొరియోగ్రఫీ ఈ పాటకు మెయిన్ హైలైట్. ఎమ్‌వి మ్యూజిక్ అండ్ మూవీస్ బ్యానర్‌పై పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సాంగ్‌కు నరసింహన్ ఎలమద్రి డైరెక్షన్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించారు. అలాగే జలంధర్ బుధారపు టెక్నికల్ అడ్వైజర్‌గా చేశారు. భూపెల్లి రాజు, అజ్మీరా రాజు అందించిన సహకారంతో ఈ పాటను ఎంతో సహజంగా తెరకెక్కించారు. మొత్తానికి తెలంగాణ జానపద గీతాల సత్తాను చాటుతూ ‘ఉంగరం’ సాంగ్ ఇంకా దూసుకుపోతూనే ఉంది.

56
మామిడి మౌనిక, నాగదుర్గల ఉంగరమే సాంగ్ లిరిక్స్ ఇవే

ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి

ఉంగూరమే రంగైన రాంలాల, టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

సెరువెనక దున్నించి సెరుకు నాటేసి

ఉంగూరమే రంగైన రాంలాల, టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

సెరుకూకు సెయ్యెత్తి మంచలే ఇచ్చి

మంచమీద సెల్లెళ్ళు కావళ్ళు గాసి

కావళ్ళతో కంటిపాపల్లు అలిసి

పాపళ్ళ సూపుల్లో పంటల్లు మెరిసి

ఉంగూరమే, అహా ఉంగూరమే

రంగైన రాంలాల టుంగూరమే

అగ్గో, ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఎనిమిది వడిశాల పైనీది గుండు

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

సేను సుట్టూ తిరిగి పిట్టల్ల కొట్టి

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఆ సేను పక్క కాలువల్ల సేపల్లు బట్టి

పట్టీన సేపలన్ని పెదగూచికి గుచ్చి

తొవ్వొంటి పోయేటి తెనుగోళ్ళ తాత

ఇవ్వి మా అదినేకు ఇచ్చిరా గొంత

ఉంగూరమే, హొయ్ హొయ్ ఉంగూరమే

రంగైన రాంలాల టుంగూరమే

అరే, ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఇచ్చి వత్తా గాని ఇల్లు నేనేరుగా

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

పోయి వత్తా గాని పోలికలెరుగ

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

మూడు బజార్లు దాటి మూల మలుపుల్ల

మలుపుల్ల మలిగినంక మా ఊళ్ళ పాత నల్ల

నల్లాల బాయికాడ ఎడమా సేతుకెళ్లి

ఏడడుగులెత్తే మాది మట్టి పెంకలిల్లు

ఉంగూరమే, హొయ్ హొయ్

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఓహో, ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే..

66
ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

తీసు పోసి పెరిగిన మీసాల కంకులిరిసి

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

కట్టెల్ల టాంపి పెట్టి కాల్సిందే కంకూల

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

సిట్ట సిట్ట సిన్నారి సేతుల్ల దీసి

కాలీన కంకులు ఆకుల్ల ఏసి

నీళ్ళ మిదులు మలిపేటి నీరాటి తాత

ఇవ్వి మా అన్నయ్యకిచ్చి రావయ్యా

ఉంగూరమే, హొయ్ హొయ్ ఉంగూరమే

రంగైన రాంలాల టుంగూరమే

అరే, ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఇచ్చి వత్తా గాని అన్ననేడా సూద్దు

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఎల్లి వత్తా గాని ఏడాని పోదు

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

మన ఊరి ఆవల ఊడుగుల పొదాలుండే

పొదలూ దాటినంకా పోషమ్మ గుడికాడ

కుడిసెయ్యి దిక్కు పోతే ఎంకన్న గుట్ట

గుట్టనడుగు మా యన్న మేకాల మేపుతండు

ఉంగూరమే, ఉంగూరమే

రంగైన రాంలాల టుంగూరమే

అరే, ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే

ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే.

Read more Photos on
click me!

Recommended Stories