సమంత ఎదురుపడితే గట్టిగా హగ్‌ చేసుకుంటా.. నాగచైతన్య షాకింగ్‌ రియాక్షన్‌.. ట్రెండింగ్‌

Published : Aug 10, 2022, 04:32 PM ISTUpdated : Aug 10, 2022, 04:40 PM IST

నాగచైతన్య, సమంతలు డైవర్స్ ప్రకటించి ఏడాది కావొస్తున్నా.. వీరిద్దరి డైవర్స్ మ్యాటర్ ఇప్పటికీ హాట్‌ టాపిక్‌ అవుతుంది. లేటెస్ట్ గా నాగచైతన్య చేసిన కామెంట్లు మరింత సెన్సేషన్‌ కావడం విశేషం. 

PREV
16
సమంత ఎదురుపడితే గట్టిగా హగ్‌ చేసుకుంటా.. నాగచైతన్య షాకింగ్‌ రియాక్షన్‌.. ట్రెండింగ్‌
নাগা- চৈতন্য

సమంత ఇటీవల `కాఫీ విత్‌ కరణ్‌` షోలో నాగచైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ మధ్య కోపం ఇంకా ఉందనే విషయాన్ని పరోక్షంగా తెలిపింది. మరోవైపు నాగచైతన్య మాత్రం ఆమెపై రెస్పెక్ట్ అలానే ఉంటుందని, ఆ గౌరవం ఎప్పటికీ మారదని తెలిపారు. అదేసమయంలో తమ విడాకులు అంత ఈజీగా జరగలేదని సమంత చెప్పడం, అంతకు ముందు నాగచైతన్య మాట్లాడుతూ ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకుల ప్రకటన జరిగిందని, ఇప్పుడు ఇద్దరం హ్యాపీగానే ఉందని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

26

ఓవైపు ఈ రచ్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగచైతన్య `లాల్‌ సింగ్‌ చడ్డా` చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో తరచూ ఆయనకు సమంతకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై చైతూ రియాక్షన్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆయన ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తుంది. 
 

36

తాజాగా సమంతకి సంబంధించిన మరో ప్రశ్న ఎదురైంది చైతూకి. ఇందులో ఇప్పుడు సమంత మీకు ఎదురుపడితే మీ రియాక్షన్‌ ఏంటని ఓ బాలీవుడ్‌ మీడియా ప్రతినిధి చైతూని ప్రశ్నించారు. దీనికి చైతూ స్పందిస్తూ ఆమెకి ముందుగా హాయ్‌ చెబుతానని, ఆ తర్వాత గట్టిగా ఓ హగ్‌ ఇస్తానని తెలిపారు. చైతూ నుంచి ఇలాంటి రియాక్షన్‌ రావడం సర్వత్రా ఆకట్టుకుంటుంది. ఒకింత షాక్‌కి గురి చేస్తుంది. ఓ జంట విడిపోయారంటే బద్దశత్రువులుగా మారుతుంటారు, ఒకరంటే ఒకరికి పడనంతగా, కోపంతో ఉంటుంటారు. కానీ అందుకు భిన్నంగా చైతూ స్పందించడం అవాక్కయ్యేలా చేస్తుంది. 

46

మరోవైపు తన చేతికున్న టాటూ గురించి కూడా చెప్పారు నాగచైతన్య. టాటూ తొలగించే ఆలోచన లేదన్నారు. తమ వెడ్డింగ్ డేట్ ని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఓ సలహా ఇచ్చారు. కీలకమైన పర్సనల్స్ డీటెయిల్స్ ని టాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి టాటూల జోలికి వెళ్ళొద్దని తెలిపాడు. 
 

56

ఇదిలా ఉంటే కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబర్‌ 6న గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో ఆదర్శ జంటగా పేరుతెచ్చుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నారు. 

66

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీఇస్తూ `లాల్‌ సింగ్‌ చద్దా`లో నటించారు. అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించారు. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రేపు(ఆగస్ట్ 11న) విడుదల కానుంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories