Published : Feb 10, 2025, 11:28 AM ISTUpdated : Feb 10, 2025, 12:07 PM IST
Thandel: నాగ చైతన్య 'తండేల్' తో ప్యాన్-ఇండియా స్టార్‌డమ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం అతని మార్కెట్‌ను విస్తరిస్తుందా లేదా అనేది తెలుసుకోండి. ప్రారంభ సూచనలు నిరాశపరుస్తున్నాయి. మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!
Naga Chaitanya Thandel failed to generate significant revenue from pan-Indian market
ప్రతీ స్టార్ హీరోకు తమ సినిమాలు ప్యాన్ ఇండియా , ఇంకా ముందుకు వెళ్లి ప్యాన్ వరల్డ్ రిలీజైతే బాగుండును అనిపిస్తూంటుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలకే ప్యాన్ ఇండియా రిలీజ్ లు సాధ్యం. ఎక్కడో కానీ కాంతారా వంటి మీడియం బడ్జెట్ సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేయవు.
ఈ క్రమంలోనే కార్తికేయ2 తో ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లి చందు మొండేటి తో సినిమా ప్లాన్ చేసారు నాగచైతన్య. తండేలు టైటిల్ తో రూపొందిన ఈ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రవేశించాలని అనుకున్నారు. అది జరిగిందా లేదా చూద్దాం.
23
Naga Chaitanya Thandel failed to generate significant revenue from pan-Indian market
ఇప్పటిదాకా అక్కినేని ఫ్యామిలీలో ఎవరు కూడా పాన్ ఇండియా స్టార్లు గా ఎదగలేకపోయారు. నాగార్జున గతంలో ట్రై చేసినా జస్ట్ ఓకే అనిపించుకున్నారు తప్పించి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లలేదు. ఆయన సోలోగా చేసిన సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేయలేకపోయాయి. దాంతో తండేలుతో నాగ చైతన్య సక్సెస్ సాధించి పాన్ ఇండియా లో స్టార్ హీరోగా ఎదుగుతారని భావించారు.
ఈ సినిమాతో తన మార్కెట్ ను కూడా భారీగా విస్తరించుకున్న వాడు అవుతాడని అభిమానులు భావించారు. అయితే తమిళ,మళయాళ, హిందీలలో ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతోంది. ప్రమోషన్స్ మీద భారీగా ఖర్చు పెట్టినా ఫలితం లేదంటోంటి ట్రేడ్. హిందీ మార్కెట్ లో తొలి రోజు ఈ చిత్రం 15 లక్షలు మాత్రమే వసూలు చేసిందని , అది బాగా తక్కువ అని ట్రేడ్ అంటోంది.
33
Naga Chaitanya Thandel failed to generate significant revenue from pan-Indian market
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ మత్య్సకారుడి ప్రేమకథకు దేశభక్తిని జోడించి దర్శకుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 𝟔𝟐.𝟑𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒+ అని అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాతలు. అయితే ఆ స్దాయి కలెక్షన్స్ లేవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏది నిజం అనేది డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకే తెలియాలి. కలెక్షన్స్ పెంచి ప్రకటించటం ఈ మధ్యకాలంలో కామన్ అయ్యిపోవటంతో ప్రతీది అనుమానంగా చూస్తున్నారు.
నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా తండేల్ నిలిచింది. అయితే తెలుగు రెండు రాష్ట్రాలు, ఓవర్ సీస్ లో తెలుగు వెర్షన్ నుంచే ఈ కలెక్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా భాషల్లో ఈ సినిమా మినిమం బజ్ క్రియేట్ చేయలేదని చెప్తున్నారు.