తన అసిస్టెంట్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య.. ఏం చేశాడంటే..?

First Published | Aug 10, 2024, 11:23 PM IST

రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకుని రెండో పెళ్ళికి రెడీ అయ్యాడు నాగచైతన్య.. ఇక ఇదే టైమ్ లో తన అసిస్టెంట్ పెళ్ళి కూడా ఉండటంతో..అతనికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు.. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న పేరు. అక్కినేని నాగచైతన్య. సమంతతో విడాకులు తరువాత మూడేళ్ళు బ్యాచిలర్ గా ఉన్న ఆయన.. నటి శోభితా ధూళిపాళ్లను నిశ్చితార్థం చేసుకుని హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఈరెండు మూడు రోజులు ఈ విషయంలో ట్రెండ్ అయిన చైతూ.. తాజాగా మరో గొప్ప పనిచేశారు. 

చైతూ తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తాడనే పేరు ఉంది. ఆయన ఎలా ఉన్నా.. తన దగ్గర పనిచేసేవారి బాగోగులు చూస్తారు చైతన్య. ఈ విషయాన్ని రీసెంట్ గా మరోసారి నిరూపించుకున్నారు చైతూ..  తాజాగా ఆయన తన అసిస్టెంట్ వివాహానికి  హాజరై సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు చైతూ.  
 


చైతూ పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ వివాహం రాజమండ్రిలో జరిగింది. ఈ వివాహ వేడుకకు చైతూ హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ క్రమంలో చైతూకి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

ఇక ప్రస్తుతం నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు చైతూ.. అందులో భాగంగానే ఆయన ప్రయోగాత్మక సినిమాను చేస్తున్నారు. జాలరి పాత్రలో చైతూ నటిస్తున్న సినిమా తండేల్. అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంనన ఈమూవీ  ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Latest Videos

click me!