42 ఏళ్ళ వయస్సులో తగ్గేదిలేదంటున్న స్నేహా.. జిమ్ లో కుమ్మేస్తుందిగా

First Published | Aug 10, 2024, 11:12 PM IST

ఏజ్ పెరుగుతున్నా కొద్ది యంగ్ బ్యూటీలా మారిపోతోంది సీనియర్ హీరోయిన్ స్నేహా.. నాలుగు పదుల వయస్సులోను తగ్గేది లేదంటోంది. 

42 ఏళ్ళ వయస్సులో.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది హోమ్లీ బ్యూటీ స్నేహ. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినా.. ఏమాత్రం ఫిట్ నెస్ కాని.. గ్లామర్ విషయంలో కాని.. తగ్గేదే లేదు అంటోంది.  సావిత్రి.. సౌందర్య తరువాత పద్దతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహా.. పెళ్ళి పిల్లల తరువాత సినిమాలు మానేసింది. తప్పదు అనుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. 

ప్రస్తుతం విజయ్ దళపతి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్' చిత్రంలోక నటిస్తుండగా.. వెంకట్ ప్రభు  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈసినిమాలో తండ్రి విజయ్ పాత్రకు జంటగా స్నేహా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈసినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. 


ఇక స్నేహ  రెగ్యూలర్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె జ్యోతిక మాదిరి వెయిట్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. అందుకోసమే ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది స్నేహా. తన బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం జిమ్ములో ఎక్కువ టైమ్ గడుపుతున్నారు. భారీ వ్యాయామాలు చేస్తూ.. తగ్గేదే లేదు అంటున్నారు. 

ఇక స్నేహా డెడికేషన్.. పనిమీద ఆమెకు ఉన్న  కమిట్మెంట్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. ఈఫోటోలు.. వీడియోలకు తెగ  లైకులు కొట్టేస్తున్నారు. ఇక స్నేహాకు పెద్దగా సినిమాలు లేవు కాని.. ఆమె ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ ను చేస్తున్నారు. సినిమాఅవకాశాలు వచ్చినా కాదననంటోంది. అంతే కాదు ప్రముఖ ఛానెల్ లో   డ్యాన్స్ షోలో జడ్జిగా  వ్యవహరించింది. అంతే కాదు ఆమెకు పలు బిజినెస్ లు కూడా ఉండగా.. అందులో ముఖ్యమైన టెక్స్ టైల్ కంపెనీని  కూడా ఆమె చూసుకుంటున్నారు. 

బరువు తగ్గించుకోవడంతో పాటు.. స్లిమ్ గా.. నాజూగ్గా అవ్వడానికి ప్రత్యేకంగా డైట్ ను కూడా ఫాలో అవుతున్నారు స్నేహ. ఇక స్నేహా.. భారీగా వర్క్ అవుట్ చేసిన  వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ వీడియోలో స్నేహా వర్కౌట్లు చేస్తూ...చెమటతో.. తడిసి ముద్దయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!