ఫస్ట్ భార్యకు విడాకులిచ్చి.. మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్స్ వీళ్లే..?

సమంతకు విడాకులిచ్చి మళ్లీ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు నాగచైతన్య.. పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు. నాగార్జున కూడా అంతే.. పవన్ కూడా అంతే.. ఇలా మళ్లీ మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 
 

Naga Chaitanya

అక్కినేని నాగ చైత‌న్య హీరోయిన్ శోభితను పెళ్ళి చేసుకోబుతన్నారు. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను 2017 లో పెళ్లాడిన చైతూ.. 2021 లో మనస్పర్ధల కారణంగా విడాకులు ఇచ్చారు.  స‌మంత‌తో విడాకుల అనంత‌రం మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డ చైతూ బోల్డ్ హీరోయిన్ శోభిళ ధూళిపాళ్ల ను పెళ్లి చేసుకోబోతున్నాడు. గురువారం వీరి ఎంగేజ్‌మెంట్ అక్కినేని నాగార్జున ఇంట్లో సింపుల్ గా జరిగింది. 
 

నాగ చైతనన్య తండ్రి.. అక్కినేని వారసుడు నాగార్జున కూడా ఇలానే  చేశాడు. రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున పెళ్లి జరిగిన తరువాత నాగచైతన్య పుట్టాడు. కాని వీరు పరస్పర సహకారంతో విడాకులు తీసుకోగా.. ఆతరువాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు కింగ్ నాగార్జున. అమలతో నాగ్ కు అఖిల్ జన్మించాడు. 
 


ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంతే.. తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన పవన్.. ఆతరువాత హీరోయిన్ రేణు దేశాయ్ తోప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల తరువాత వీరు కూడా ఇద్దరి అంగీకారంతో విడిపోయారు. ఆతరువాత రష్యన్ నటి అన్నా లెజినోవాతో మరోసారి ప్రేమలో పడ్డాడు పవన్ స్టార్. అన్నాను పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం ఇద్దరు సంతోషంగా ఉన్నారు. 
 

ఇక బాలీవుడ్ లో ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరిగాయి. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగింది. సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్  క‌రీనా క‌పూర్‌ని ల‌వ్ మ్యారేజీ చేసుకున్న విష‌యం తెలిసిందే.5 ఏళ్లు డేటింగ్ తరువాత వీరు 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇక సైఫ్‌కి ఇంతకు ముందే అమృతాసింగ్ తో పెళ్ళి జరగ్గా.. ఆమెకు విడాకులు ఇచ్చి కరీనానుపెళ్లాడాడు సైఫ్. మొదటిభార్యతో సైఫ్ కు  సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా  రెండు లవ్ మ్యారేజ్ లు చేసుకున్నారు.  మొదటి భార్య రీనాదత్తా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ 16 ఏళ్ల త‌ర్వాత విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లు బ్యాచిలర్ గా ఉన్న అమీర్.. ఆతరువాత 2005 లో బాలీవుడ్ ద‌ర్శ‌కురాలు కిర‌ణ్ రావు తో ప్రేమలో పడ్డారు.. వెంటనే  పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 16 ఏళ్లకు పైగా కలిసి ఉన్నారు. ఆతరువాత  2021లో విడిపోయారు.
 

బాలీవుడ్ గ్రీకు వీరుడు.. ఇండియన్ హ్యాండ్సమ్ హీరో  హృతిక్ రోష‌న్ కూడా రెండు సార్లు ప్రేమలో పడ్డారు. ప్ర‌ముఖ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ సుస్సానే ఖాన్‌ను 2000లో పెళ్లి చేసుకున్న హృతిక్ 2014లో విడాకులు తీసుకున్నాడు. వీరికి హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే త‌న డివోర్స్ ప్ర‌క‌టించిన చాలా ఏళ్ల  తరువాత బాలీవుడ్ న‌టి స‌బా అజాద్‌తో  ప్రేమలో పడ్డాడు..  ప్ర‌స్తుతం వీళ్లిద్దరు  సహజీవనం చేస్తున్నారు. 

Latest Videos

click me!