Custody Review: కస్టడీ మూవీ ట్విట్టర్ టాక్: నాగ చైతన్య ప్రయోగం ఫలించిందా... ఫ్యాన్స్ ఊహించని రెస్పాన్స్!

First Published | May 12, 2023, 4:52 AM IST

అక్కినేని నాగ చైతన్య-కృతి శెట్టి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కస్టడీ. ప్రియమణి, అరవింద స్వామి కీలక రోల్స్ చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 
 

Custody Movie Review

నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ భారీ డిజాస్టర్. దీంతో ఆయన గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే ఇతర పరిశ్రమల్లో మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బైలింగ్వెల్ మూవీ చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ కస్టడీ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదలైంది. దర్శకుడు వెంకట్ ప్రభు యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. నాగ చైతన్య పోలీస్ రోల్ చేశారు.

Custody Movie Review

కస్టడీ ప్రోమోలు ఆసక్తి పెంచాయి. నాగ చైతన్య ఓ డిఫరెంట్ సబ్జెక్టు తో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారని చిత్ర వర్గాలు భావించాయి. ఆయన లుక్, క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించాయి. హీరోయిన్ కృతి శెట్టి రోల్ కూడా రా అండ్ రస్టిక్ అన్నట్లుగా ఉంది. కీలక రోల్స్ చేసిన ప్రియమణి, అరవింద స్వామి సైతం క్యూరియాసిటీ పెంచేశారు. మరి అంచనాల మధ్య విడుదలైన కస్టడీ ప్రేక్షకులను సంతృప్తిపరిచిందా... 
 


Custody Movie Review

సోషల్ మీడియాలో కస్టడీ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. మెజారిటీ ఆడియన్స్  సినిమా పర్లేదు, యావరేజన్న  అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నాగ చైతన్య, అరవింద స్వామి పెర్ఫార్మన్స్ అద్భుతం. కృతి శెట్టి సైతం తన పాత్రకు న్యాయం చేశారు. అయితే కథ, కథనాల్లో పెద్దగా దమ్ములేదంటున్నారు.

Custody Movie Review

నెమ్మదిగా మొదలైన కస్టడీ మూవీ... ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమాకు ప్రధాన మైనస్ సాంగ్స్ అన్న మాట వినిపిస్తోంది. సాంగ్స్ విషయంలో కస్టడీ పూర్తిగా నిరాశపరుస్తుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సాంగ్స్ పరంగా మెప్పించలేకపోయారంటున్నారు. 
 

Custody Movie Review


సాంకేతిక విషయాలకు వస్తే ఎడిటింగ్ పర్లేదు, సినిమాటోగ్రఫీ బాగుందని అంటున్నారు. ఉన్నత నిర్మాణ విలువలతో కస్టడీ మూవీ తెరకెక్కింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. అది లేనప్పుడు సినిమా తేలిపోతుంది. కస్టడీ చిత్రం కథనం ఆకట్టుకోదని అంటున్నారు. 

Custody Movie Review

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన మానాడు భారీ హిట్. శింబుకు మంచి విజయాన్ని ఆ సినిమా కట్టబెట్టింది. నాగ చైతన్య అందుకే వెంకట్ ప్రభుకు అవకాశం ఇచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనిపిస్తుంది. తమిళ దర్శకులతో టాలీవుడ్ హీరోలకు ఎక్కువ సందర్భాల్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి.

అయితే కొందరు ఆడియన్స్ కస్టడీ ఆద్యంతం అలరించింది అంటున్నారు. సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ బాగున్నాయని అంటున్నారు. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ సైతం మెప్పిస్తుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. మరి సినిమా ఫలితం ఏమిటో తెలియాలంటే పూర్తి రివ్యూ కోసం వేచి చూడాల్సిందే...

Latest Videos

click me!