నాగ చైతన్య కస్టడీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో కస్టడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సమంత గురించి చైతు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు. అయితే సమంత మాత్రం తరచుగా సోషల్ మీడియాలో పరోక్షంగా చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
26
అయితే నాగ చైతన్య కస్టడీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో కస్టడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సమంత గురించి చైతు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన చైతు, సమంత.. 2021లో విడాకులు తీసుకున్నారు.
36
చైతు, సమంత విడిపోవడానికి కారణం అంటూ అప్పట్లో చాలా రూమర్స్ వినిపించాయి. అందులో ప్రధానంగా హైలైట్ అయింది. ఫ్యామిలీ మాన్2 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ సీన్స్ లో నటించడం వల్లే వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం జరిగింది. అయితే అసలు నిజం ఏంటనేది వారిద్దరికి మాత్రమే తెలుసు.
46
తాజాగా ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంత చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ఆమె నటించిన ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్ 2 అంటే నాకు చాలా ఇష్టం. రీసెంట్ గా యశోద కూడా చూశాను. సమంత నటించే అన్ని చిత్రాలు చూస్తానని నాగ చైతన్య అన్నారు.
56
సో ఫ్యామిలీ మ్యాన్ 2 కానీ, సమంత నటించిన ఇతర చిత్రాలు కానీ వీరి విడాకులకు కారణం కాదని చైతూ క్లారిటీ ఇచ్చినట్లు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల సమంత 'మనమంతా ఒక్కటే.. కేవలం ఇగోలు, నమ్మకాలు, భయాల వల్లే విడిపోయాం'అని ఉన్న కొటేషన్ ని షేర్ చేసింది.
66
ఇదిలా ఉండగా కస్టడీ చిత్రంతో చైతు ఏమేరకు మెప్పిస్తాడు అనే ఆసక్తి అంతటా నెలకొంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అక్కినేని ఫ్యామిలీకి ఒక హిట్ అవసరం. రీసెంట్ గా అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది.