ఘనంగా నాగ చైతన్య-శోభిత పెళ్లి వేడుక, మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులు ఎవరంటే..?

First Published | Dec 4, 2024, 9:23 PM IST

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళిాకి మెగాస్టార్ తో పాటు స్టార్స్ ఎందరో హాజరయ్యారు. ఎవరెవరు వచ్చారంటే..? 

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో  లైట్లు, పూలతో వేదిక అందంగా అలంకరించారు. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్ళి  వేదిక వద్ద భారీగా  భద్రత కూడా ఏర్పాటు చేశారు. 

తాత అక్కినేని నాగేశ్వరరావు సంప్రదాయాన్ని పాటిస్తూ, నాగ చైతన్య పెళ్లిలో పంచె ధరించారు.  ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ దుస్తులైన పంచె ధరించగా..పెళ్లి మండపం పై చైతన్య కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. 


ఇక  శోభితా దూళిపాళ్ల కూడా తన కుటుంబ సంప్రదాయాన్ని పాటించి పట్టుచీరలో మెరిసిపోయారు. అంతే కాదు తన తల్లి వారసత్వంగా వచ్చిన అమ్మమ్మ  బంగారు నగలు ధరించారు. శోభితా పెళ్లి కూతురు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 

 8.13 నిమిషాలకు హీరో నాగచైతన్య-శోభిత మెడలో మూడు ముళ్లు వేశారు. అన్నపూర్ణ స్టూడియో లో ఈ పెళ్ళి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా ముహూర్తం  సమయానికి శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య. పెళ్లి వేడుక అంతా  హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. 

ఈ పెళ్లి వేడుకకు చాలా మంది సినీ తారలు హాజరయినట్టు తెలుస్తోంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి  మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి.  రామ్ చరణ్, ఉపాసన, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, అల్లు అర్జున్ వంటి తారలు ఈ వేడుకకు హాజరయినట్టు సమాచారం. వీరితో పాటు  వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి , సుహాసిని, కీరవాణి తదితరులు ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం. 

నాగ చైతన్యకి ఇది రెండో వివాహం. 2017 అక్టోబర్‌లో సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించి, 2022లో విడాకులు తీసుకున్నారు. 

Latest Videos

click me!