PUSHPA 2 FIRST REVIEW
పుష్ప 2 థియేటర్స్లోకి రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 4 రాత్రి నుండే పుష్ప 2 ప్రీమియర్ షోల ప్రదర్శన జరగనుంది. యూఎస్ కంటే ముందు ఏపీ/తెలంగాణాలలో షోలు పడనున్నాయి. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. ఏకంగా మూడేళ్లు కష్టపడి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
PUSHPA 2 FIRST REVIEW
అల్లు అర్జున్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ మూవీ పుష్ప 2. ఈ మూవీ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్న నిర్మాతలు ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అలాగే చిత్ర ప్రముఖులకు పుష్ప 2 చూపించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ కాపీ నేను చూశానని, మగధీర చూశాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అదే ఫీలింగ్ పుష్ప 2 చూశాక కలిగిందని అల్లు అరవింద్ అన్నారు. ఇక పుష్ప మూవీ చూసిన చిత్రవర్గాల నుండి టాక్ బయటకు వస్తుంది. పుష్ప 2 ఫస్ట్ రివ్యూ పరిశీలిస్తే.. ఈ విధంగా ఉంది..
PUSHPA 2 FIRST REVIEW
పుష్ప 2 కథేంటి? అల్లు అర్జున్, రష్మిక మందాన పెళ్లి సీన్తో పుష్ప పార్ట్ వన్ ముగుస్తుంది. కథ అక్కడే మొదలవుతుందట. శ్రీవల్లిని వివాహం చేసుకున్న పుష్పరాజ్... అంచెలంచెలుగా ఎదుగుతాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మాఫియాను కనుసన్నల్లో నడిపించే కింగ్ అవుతాడు. పుష్పరాజ్ రేంజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ కి విస్తరిస్తుంది. మరోవైపు షెకావత్ పగతో రగిలిపోతూ ఉంటాడు. పుష్పరాజ్ ని కట్టడి చేయలేకపోతున్నానని ఆక్రోశం వెళ్లగక్కుతాడట. అసలు పుష్పరాజ్ నేర సామ్రాజ్యాన్ని ఎవరు ఎలా కంట్రోల్ చేశారు? పుష్పరాజ్ జీవితం స్మగ్లర్ గానే ముగిసిందా? ఆ క్యారెక్టర్ లో పాజిటివ్ షేడ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి.
PUSHPA 2 FIRST REVIEW
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన సాటి లేకుండా ఉందట. అల్లు అర్జున్ ఎంట్రీ షాట్ సినిమాకు హైలెట్ అట. నిజంగా అభిమానులు పండగ చేసుకుంటారట. ప్రతి పది నిమిషాలకు క్లైమాక్స్ ని తలపించే ట్విస్ట్, హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అట. అల్లు అర్జున్ లుక్, మేనరిజం మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అంటున్నారు.
Pushpa 2
రెండు పాటల్లో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ చూస్తే డాన్స్ లో ఎవరు పోటీ లేరు అన్నట్లు ఉంటాయట. కిస్సిక్, పీలింగ్స్ సాంగ్స్ లో అల్లు అర్జున్ మోత మోగించాడట. పుష్ప 2లో రష్మిక మందాన పాత్ర కూడా చాలా కీలకం. రష్మిక మందాన కెరీర్ బెస్ట్ ఇచ్చిందట. ఇక శ్రీలీల కిస్సిక్ సాంగ్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిందట. బెస్ట్ డాన్సర్స్ అయిన శ్రీలీల, బన్నీ దుమ్ములేపారట.
అనసూయ రోల్, లుక్ కి విజిల్స్ పడతాయట. అనసూయకు ఈ క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని టాక్. పార్ట్ 2 లో అనసూయకు మరింత స్క్రీన్ స్పేస్ దక్కిందట. ఇక సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్, జగపతిబాబు మధ్యలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసిందట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రాజీ పడకుండా చాలా బాగా చేశారట. మొత్తంగా పుష్ప 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు.